Ration card: రేషన్ కార్డుదారులు అలర్ట్‌.. ఈ తప్పులు చేస్తున్నారా క్షణాల్లో కార్డు రద్దు..!

Ration card: రేషన్ కార్డుదారులు అలర్ట్‌.. ఈ తప్పులు చేస్తున్నారా క్షణాల్లో కార్డు రద్దు..!

Ration Card: మీకు రేషన్‌కార్డు ఉంటే ఈ వార్త మీకోసమే. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. రేషన్ కార్డులో తేడాలుంటే రద్దు చేస్తారు.

uppula Raju

|

Mar 06, 2022 | 8:28 PM

Ration Card: మీకు రేషన్‌కార్డు ఉంటే ఈ వార్త మీకోసమే. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. రేషన్ కార్డులో తేడాలుంటే రద్దు చేస్తారు. మీరు చాలా కాలంగా ఆహార ధాన్యాలు తీసుకోవడానికి మీ రేషన్ కార్డును ఉపయోగించకపోతే మీ కార్డును రద్దు చేసే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా పథకం కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఆహార ధాన్యాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఆధారంగా అతి తక్కువ ధరకు రేషన్ అందిస్తుంది. పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడమే ఈ పథకం ఉద్దేశ్యం. వాస్తవానికి మీరు ఏ నెలలో రేషన్ తీసుకున్నారు.. మీ కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు వంటి మొత్తం సమాచారం రేషన్ కార్డులో ఉంటుంది. నిబంధనల ప్రకారం.. మీ పేరు మీద రేషన్ కార్డు ఉంటేనే మీకు పీడీఎస్‌లో ఆహార ధాన్యాలు అందుతాయి. కానీ ఇటీవల అనేక కేసులు తెరపైకి వచ్చాయి. ఇందులో చాలా కాలంగా ఉపయోగించని రేషన్ కార్డులన్నీ రద్దు చేశారు.

‘రేషన్ కార్డుదారుడు ఆరు నెలలుగా రేషన్ తీసుకోకపోతే నిబంధనల ప్రకారం అతనికి తక్కువ ధరకు లభించే ఆహార ధాన్యాలు అవసరం లేదని అర్థం. లేదా అతనికి రేషన్ తీసుకునే అర్హత లేదని తేలుతుంది. ఈ కారణాల ఆధారంగా ఆరు నెలలుగా రేషన్ తీసుకోని వ్యక్తి రేషన్ కార్డు రద్దు అవుతుంది. రాజధాని ఢిల్లీ, బీహార్, జార్ఖండ్‌లలో రేషన్ విషయంలో ఇదే నియమం వర్తిస్తుంది. ఒకవేళ మీ రేషన్ కార్డు రద్దు చేస్తే మీరు దానిని మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు మీ రాష్ట్రంలోని AePDS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కొన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాదు మీరు భారతదేశం అంతటా AePDS రేషన్ కార్డ్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా దీన్ని సక్రియం చేసుకోవచ్చు.

అలాంటి అబ్బాయిలని అమ్మాయిలు తెగ ఇష్టపడుతారు.. పెళ్లికి వెంటనే ఓకె చెబుతారు..!

Children Watch TV: టీవీ నుంచి పిల్లలని తప్పించేదెలా.. ఇలా చేస్తే బెటర్..

Indian Railway: రైల్వే ప్రయాణికులకు గమనిక.. టికెట్‌పై ఉండే ఈ 5 అంకెల సంఖ్యని గమనించారా..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu