CHALO CARD: బస్సు చెల్లింపులకు ఛలో​ కార్డ్.. త్వరలో వాటర్ మెట్రో..

CHALO CARD: టూరిస్టులు, ప్రకృతి ప్రేమికులకు ముందుగా గుర్తొచ్చే ప్రదేశం కేరళ రాష్ట్రం. అక్కడి అందాలను తిలకించేందుకు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఏటా లక్షల మంది ఆ రాష్ట్రానికి వెళుతుంటారు.

CHALO CARD: బస్సు చెల్లింపులకు ఛలో​ కార్డ్.. త్వరలో వాటర్ మెట్రో..
Chalo Card
Follow us

|

Updated on: Mar 06, 2022 | 5:04 PM

CHALO CARD: టూరిస్టులు, ప్రకృతి ప్రేమికులకు ముందుగా గుర్తొచ్చే ప్రదేశం కేరళ రాష్ట్రం. అక్కడి అందాలను తిలకించేందుకు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఏటా లక్షల మంది ఆ రాష్ట్రానికి వెళుతుంటారు. ఇలా ప్రయాణాల్లో సహజంగా ఎదురయ్యే సమస్య చెల్లింపులకు సరిపడా చిల్లర లేకపోవటం.. కొన్ని సార్లు ఫిజికల్ క్యాష్ చేతిలో లేకపోవటం. బస్సు ప్రయాణాల్లో ఇవి మరింతగా చికాకు కలిగిస్తుంటాయి. అందుకే ఇటువంటి సమస్యలకు పరిష్కారంగా.. కేరళలోని కాసర​గోడ్​లో ‘ఛలో ట్రావెల్​ కార్డ్’​ అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాలోని బస్సు సర్వీసుల డిజిటలీకరణలో భాగంగా ఈ కొత్త పద్ధతిని అక్కడి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీని సేవలను విడతల వారీగా విస్తరించాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ ట్రావెల్ కార్డుకు ఎస్ బ్యాంక్ సేవలు అందిస్తోంది. దీనిని బస్ కండక్టు నుంచి పొందవచ్చు. ప్రస్తుతం భోపాల్, గువహటి, ఇండోర్, జబల్ పూర్, కొచి, మంగళూరు, ముంబయి, పాట్నా, ఉడిపి లలో సేవలు అందుబాటులో ఉన్నాయి.

అసలు ఈ ఛలో ట్రావెల్​ కార్డ్ అంటే ఏమిటి..

సాధారణంగా మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు ఇచ్చే కార్డు లాంటిదే ఈ ఛలో ట్రావెల్​ కార్డు. ఈ కార్డును ప్రయాణ సమయాల్లో చెల్లింపులకు అవసరమైన సొమ్మును డిజిటల్ గా లోడ్ చేసుకోవాలి. రూ. 30 నుంచి మూడు వేల రూపాయల వరకు ఎంతైనా రీఛార్జి చేసుకోవచ్చు. ఈ కార్డు ద్వారా టికెట్ చెల్లింపులు చేసేవారికి 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

త్వరలో వాటర్ మెట్రో..

దీనికి తోడు కేరళ ప్రభుత్వం త్వరలోనే వాటర్ మెట్రో ప్రాజెక్టు కూడా కొచ్చి ప్రజలకు అందుబాటులోకి రానుంది. మెుదటి విడతలో వైట్టిలా నుంచి కక్కానాడ్​ మధ్య సేవలు ప్రారంభం అవుతాయి. 50 నుంచి 100 మంది ప్రయాణించే విధంగా బోట్లను సిద్ధం చేస్తోంది అక్కడి ప్రభుత్వం. 76 కిలోమీటర్ల జల మార్గంలో 38 టెర్మినల్స్​ను కొచ్చి వాటర్​ మెట్రో ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మెుత్తం 78 బోట్లను నడపనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి.. 

MEIL: పుణె రహదారులపై మరో 150 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రారంభించిన ప్రధాని మోదీ

Fire Accident: కెమికల్ కంపెనీలో మంటలు.. రియాక్టర్లు ధ్వంసం.. కిలోమీటర్ల మేర పొగలు..