AIIMS Patna 2022: నెలకు 67వేల జీతంతో.. ఎయిమ్స్ పాట్నలో ఫ్యాకల్టీ పోస్టులు.. రాత పరీక్షలేకుండానే ఎంపికలు..

AIIMS Patna 2022: నెలకు 67వేల జీతంతో.. ఎయిమ్స్ పాట్నలో ఫ్యాకల్టీ పోస్టులు.. రాత పరీక్షలేకుండానే ఎంపికలు..
Aiims Patna

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన పాట్నాలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Patna) శాశ్వత ప్రాతిపదికన ప్రొఫెసర్‌ పోస్టుల (Professor posts)భర్తీకి అర్హులైన..

Srilakshmi C

|

Mar 06, 2022 | 5:14 PM

AIIMS Patna Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన పాట్నాలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Patna) శాశ్వత ప్రాతిపదికన ప్రొఫెసర్‌ పోస్టుల (Professor posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 11

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిట్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

విభాగాలు: ఈఎన్టీ, పీడియాట్రిక్స్‌, ఎమర్జెన్సీ, మెడిసిన్‌, ఫిజికల్‌ మెడిసిన్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 58 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ. 39,100ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ఎండీ/ఎంసీహెచ్‌, డీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఒక సంవత్సరం నుంచి 14 ఏళ్లపాటు అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ. 590

దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి (మార్చి 20, 2022).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NPCIL 2022 ప్రిలిమినరీ పరీక హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu