NPCIL 2022 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) నరోరా అటామిక్ పవర్ స్టేషన్‌లోని స్టైపెండరీ ట్రైనీ ఆపరేటర్ (కేటగిరీ-II) పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది..
NPCIL Stipendiary Trainee Operator Admit Card 2022: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) నరోరా అటామిక్ పవర్ స్టేషన్‌లోని స్టైపెండరీ ట్రైనీ ఆపరేటర్ (కేటగిరీ-II) పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ npcilcareers.co.inలో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఎన్‌పీసీఐఎల్ మొత్తం 72 స్టైపెండరీ ట్రైనీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయడానికి గాను ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల (మార్చి) 26న నిర్వహించనుంచి. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై 10 గంటల వరకు కొనసాగుతుంది. ఈ పరీక్ష తర్వాత స్టేజ్ 2 అడ్వాన్స్‌డ్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిముషాల వరకు జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి ఉదయం 7 గంటల 30 నిముషాలకు చేరుకుని, రిపోర్టు చేయవల్సి ఉంటుంది. కాగా పరీక్ష ఓఎమ్‌ఆర్ షీట్/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో ఉంటుంది. ప్రలిమినరీ పరీక్షలో మొత్తం 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు ఒక గంటలో సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.
NPCIL అడ్మిట్ కార్డ్ 2022 ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్npcilcareers.co.inను ఓపెన్ చెయ్యాలి.
- లాగిన్ పోర్టల్‌పై క్లిక్ చేసి, సరైన ఆధారాలను నమోదు చేసి సబ్‌మిట్ చెయ్యాలి.
- వెంటనే అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
- డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ ఔట్ తీసుకోవాలి.
Also Read: