CBSE Term-2 exams 2022: 10, 12 తరగతుల ప్రాక్టికల్ పరీక్షలు తప్పనిసరిగా ఈ తేదీల్లోనే పూర్తి చెయ్యాలి! ఏప్రిల్‌ 26 నుంచి..

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ పరిధిలోని అన్ని స్కూళ్లలో సెమిస్టర్‌ -II ప్రాక్టికల్‌ (CBSE Term-2 practicals) పరీక్షలను సకాలంలో పూర్తి చెయ్యలని అన్ని స్కూళ్లకు ఆదేశాలను జారీ చేసింది..

CBSE Term-2 exams 2022: 10, 12 తరగతుల ప్రాక్టికల్ పరీక్షలు తప్పనిసరిగా ఈ తేదీల్లోనే పూర్తి చెయ్యాలి! ఏప్రిల్‌ 26 నుంచి..
Cbse Term 2 Practicals
Follow us

|

Updated on: Mar 06, 2022 | 4:05 PM

CBSE 10th, 12th Practical Exam Results 2022: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ పరిధిలోని అన్ని స్కూళ్లలో సెమిస్టర్‌ -II ప్రాక్టికల్‌ (CBSE Term-2 practicals) పరీక్షలను సకాలంలో పూర్తి చెయ్యలని అన్ని స్కూళ్లకు ఆదేశాలను జారీ చేసింది. అన్ని స్కూళ్లు తప్పనిసరిగా మార్చి 2 నుంచి 10లోపు ప్రాక్టికల్స్ పూర్తి చెయ్యాలని సీబీఎస్సీ సూచించింది. ప్రాక్టికల్‌ పరీక్షలు పూర్తయ్యాక.. సీబీఎస్సీ టర్మ్‌ 2 థియరీ పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపింది. సీబీఎస్సీ 2022 టర్మ్‌ 2 పరీక్షల షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైంది. ఈ షెడ్యూల్‌ ప్రకారం 10, 12వ తరగతులకు సంబంధించిన ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ మార్చి 2 నుంచి ప్రారంభంకానున్నాయి. థియరీ పరీక్షలకు 10 రోజుల ముందుగా ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నట్లు తెల్పింది. ఇక టర్మ్-2 బోర్డు పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జరగనున్నట్లు సీబీఎస్సీ (CBSE) గురువారం (ఫిబ్రవరి 24) ప్రకటించింది. కాగా 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12 తరగతుల పరీక్షలను కోవిడ్-19 ప్రోటోకాల్‌ ప్రకారం ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేసింది. థియరీ పరీక్షల్లో విద్యార్థులు ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు సంబంధించిన నమూనా ప్రశ్న పత్రాలను(sample question papers) బోర్డు ఇప్పటికే విడుదల చేసింది. విద్యార్ధులు సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో cbse.gov.in శాంపిల్ క్వశ్చన్‌ పేపర్లను చూడొచ్చు.

కాగా సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించడానికి విద్యార్థులను బ్యాచ్‌లుగా విడగొట్టి, ఒక్కోబ్యాచ్‌కు 10 మంది విద్యార్థుల ప్రకారంగా ల్యాబ్‌లలో పరీక్షలను నిర్వహించాలని సూచించింది.10వ తరగతి రెగ్యులర్ విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు, 12వ తరగతి రెగ్యులర్ విద్యార్ధులకు ప్రాక్టికల్ పరీక్షలు ఈ ప్రకారంగా జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను మార్చి 2 నుంచి రోజువారీ ప్రాతిపదికన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని బోర్డు తెల్పింది. ప్రాక్టికల్‌ మార్కుల అప్‌లోడ్ సంబంధిత చివరి తేదీలోపు పూర్తి చెయ్యాలి. ఎట్టిపరిస్థితిలోనూ చివరితేదీని బోర్డు పొడిగించదని అధికారిక నోటిఫికేషన్‌లో తెల్పింది.

ఇక 10, 12 తరగతులకు చెందిన ప్రైవేట్ అభ్యర్థులకు ప్రాక్టికల్ పరీక్షలు లేనట్లు పేర్కొంది. బోర్డు నిర్వహించే థియరీ పరీక్షల్లో సాధించిన మార్కులను ప్రో-రేటా ప్రాతిపదికన కేటాయించడం జరుగుతుంది. గత ఏడాది మాదిరి ప్రాక్టికల్ పరీక్షలు/ ప్రాజెక్ట్/ ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లకు సూచించిన మార్కులు, థియరీ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ప్రో-రేటా ప్రకారంగానే ఈ ఏడాది కూడా మార్కులు కేటాయించనున్నట్లు నోటిఫికేసన్‌లో బోర్డు తెల్పింది.

Also Read:

NIOS 2022 Hall Ticket: 10, 12 తరగతుల పబ్లిక్ పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష రోజున ఈ నిబంధనలు తప్పనిసరి!

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో