MEIL: పుణె రహదారులపై మరో 150 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రారంభించిన ప్రధాని మోదీ
MEIL News: ప్రధాని నరేంద్ర మోదీ పుణెలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్(Olectra Greentech) సంస్థ తయారు చేసిన 150 విద్యుత్ బస్సులకు(Electric Buses) పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
MEIL: ప్రధాని నరేంద్ర మోదీ పుణెలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్(Olectra Greentech) సంస్థ తయారు చేసిన 150 విద్యుత్ బస్సులకు(Electric Buses) పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా కంపెనీ సబ్సిడరీ కంపెనీ అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెండ్ ఈ బస్సులను దేశీయంగా తయారు చేసింది. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని బస్సులతో పాటు బనార్ లోని వాటి ఛార్జింగ్ స్టేషన్లను సైతం ప్రారంభించారు. పూణెలోని ప్రజా రవాణా అవసరాలకోసం ప్రవేశపెట్టిన 150 ఎలక్ట్రిక్ బస్సులను మోదీ ప్రజలకు అంకింతం చేశారు. దేశంలో ప్రజలందరూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని, మెుబిలిటీని ప్రోత్సహించాలని సూచించారు. దీని ద్వారా డీజిల్ పెట్రోల్ ధరల పెంపును అధిగమించటమే కాక కర్భన్ ఉద్ఘారాలను సైతం తగ్గించవచ్చని అన్నారు. ఇప్పటికే సూరత్, ముంబై, పుణె, సిల్వాసా, గోవా, నాగ్‌పూర్, హైదరాబాద్, డెహ్రాడూన్‌లలోనూ ఒలెక్ట్రా బస్సులు నడుస్తున్నాయి.
ఇప్పటికే పూణె ప్రజా రవాణాలో 150 ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా.. తాజాగా మరో 150 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు ఒలెక్ట్రా సంస్థ ఛైర్మన్, మ్యానేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ వెల్లడించారు. తమ సంస్థ వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించేందకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. పుణేలో ఇప్పటి వరకు 2 కోట్ల కిలోమీటర్లకు పైగా తమ బస్సులు తిరిగాయని స్పష్టం చేశారు. బస్సులు 12 మీటర్ల పొడవు, పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ సౌకర్యంతో.. 33 మంది సీటింగ్ కెపాసిటీని కలిగి ఉన్నాయని సంస్థ తెలిపింది. బస్సులో అమర్చిన లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు. అధిక-పవర్ AC & DC ఛార్జింగ్ సిస్టమ్ బ్యాటరీని 3-4 గంటల్లో రీఛార్జ్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తుందని తెలిపింది. దీనికి తోడు బస్సులో భద్రతలో భాగంగా ఎలక్ట్రానిక్‌గా నియంత్రించబడే ఎయిర్ సస్పెన్షన్, CCTV కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్‌లు ఉన్నాయని పేర్కొంది.
Hon’ble Prime Minister of India, Shri Narendra Modi Ji has dedicated a fleet of 150 Electric Buses manufactured by Olectra in Pune for Public Transport along with state of the art Electric Bus Depot and Charging station pic.twitter.com/PjGVDDvFqv
— Olectra Greentech Limited (@OlectraEbus) March 6, 2022
హైదరాబాద్‌కు చెందిన మెగా ఇంజనీరింగ్ సంస్థ ఆల్ వెదర్ జోజిలా టన్నెల్ ను నిర్మిస్తోంది. దాదాపు 10 దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న మెగా సంస్థ.. దేశంలోనూ ప్రధాన మౌలిక సదుపాయాల కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది.
ఇవీ చదవండి..
Fire Accident: కెమికల్ కంపెనీలో మంటలు.. రియాక్టర్లు ధ్వంసం.. కిలోమీటర్ల మేర పొగలు..
No Internet: ఆ రాష్ట్రంలో రేపటి నుంచి 8 రోజులు ‘ఇంటర్నెట్ సేవలు బంద్’.. కారణమేంటంటే..