Fire Accident: మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లా ఖోపోలీలోని ఓ కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం(Fire Broke) చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు(Injured). పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో నాలుగైదు కిలోమీటర్ల మేర పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితులు నెలకొంది. ఈ అగ్నిప్రమాదం వల్ల కంపెనీకి భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం.
మంటలు అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
వివరాల ప్రకారం.. పాత ముంబై-పూణే హైవేలోని ఖోపోలిలోని ఆల్టా ఫార్మాస్యూటికల్ ల్యాబ్‌లో(Alta Pharmaceutical Lab) ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ మెథోల్ ప్లాంట్‌లోని 8 రియాక్టర్లూ ధ్వంసమయ్యాయి. తక్కువ వ్యవధిలోనే మంటలను అదుపు చేసినట్లు తెలుస్తోంది. మంటల ధాటికి కంపెనీ ప్లాంట్ మొత్తం దగ్ధమైంది. దీని కారణంగా కంపెనీలో భారీ ఆస్థి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి అసలు కారణం ఏమిటి అని వారు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి..
No Internet: ఆ రాష్ట్రంలో రేపటి నుంచి 8 రోజులు ‘ఇంటర్నెట్ సేవలు బంద్’.. కారణమేంటంటే..
INDW vs PAKW: పాకిస్తాన్‌పై వరుసగా 11వ విజయం సాధించిన భారత్.. కీలక పాత్ర పోషించిన 5గురు ఆటగాళ్లు..