Mahesh Babu: సూపర్‌ స్టార్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పిన రోజా.. ఉబ్బితబ్బిబ్బైపోతోన్న మహేశ్‌ ఫ్యాన్స్..

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) సిల్వర్‌ స్ర్కీన్‌పైనే కాదు నిజ జీవితంలోనూ 'శ్రీమంతుడు' అనిపించుకుంటున్నాడు

Mahesh Babu: సూపర్‌ స్టార్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పిన రోజా.. ఉబ్బితబ్బిబ్బైపోతోన్న మహేశ్‌ ఫ్యాన్స్..
Mahesh Babu
Follow us
Basha Shek

|

Updated on: Mar 06, 2022 | 2:26 PM

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) సిల్వర్‌ స్ర్కీన్‌పైనే కాదు నిజ జీవితంలోనూ ‘శ్రీమంతుడు’ అనిపించుకుంటున్నాడు. వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిమానుల మదిలో రియల్‌ హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తోన్న మ‌హేష్‌ తాజాగా మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. చిన్నారుల హృదయ స్పందన కోసం తన ఎంబీ ఫౌండేషన్, హైదరాబాద్‌ రెయిన్‌బో హాస్పిటల్‌ల సంయుక్త సహకారంతో ‘ప్యూర్‌ లిటిల్ హార్ట్స్’ ఫౌండేషన్‌ ప్రారంభించారు. దీనికి సంబంధించి శనివారం బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆసుపత్రిలో మహేష్‌ లిటిల్ హార్ట్స్‌ ఫౌండేషన్‌ లోగోను ఆవిష్కరించారు. కాగా చిన్నారుల కోసం సూపర్‌ స్టార్‌ చేస్తోన్న మంచి పనిపై సెలబ్రిటీలు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా సీనియర్‌ నటి, నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి (Roja Selvamani) మహేశ్‌ బాబును ప్రత్యేకంగా అభినందించారు. ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేష‌న్ కార్యక్రమంలో ప్రిన్స్‌ మాట్లాడుతున్న వీడియో షేర్ చేసిన రోజా.. ‘చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేష్‌కి హ్యాట్సాఫ్’ అని ట్విట్టర్‌ లో పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

కాగా ఇప్పుడే కాదు.. గతంలోనూ మహేశ్‌ అంటే ప్రత్యేక అభిమానం చూపించారు రోజా. ఈ తరం ఫేవరేట్‌ హీరోల్లో ప్రిన్స్ అంటే చాలా ఇష్టమని, అతనితో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకోనని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు మహేశ్‌. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌లో మహేశ్‌ జాయిన్‌ కానున్నారు.

Also Read:INDW vs PAKW: పాకిస్తాన్‌పై వరుసగా 11వ విజయం సాధించిన భారత్.. కీలక పాత్ర పోషించిన 5గురు ఆటగాళ్లు..

Toothpast Colors: టూత్‌పేస్ట్ ట్యూబ్‌పై ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల అర్థాలు ఏమిటో తెలుసా..?

Firing: అమృత్‌సర్ బీఎస్ఎఫ్ క్యాంప్‌లో దారుణం.. తోటి సిబ్బందిపై కాల్పులు జరిపిన జవాన్..