Horoscope Today: ఈరాశి వారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (08-03-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు.

Horoscope Today: ఈరాశి వారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Basha Shek

|

Updated on: Mar 08, 2022 | 6:40 AM

Horoscope Today (08-03-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మార్చి 8 ) రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

మేష రాశి

ఈ రాశివారు తమ వృత్తిగత, వ్యక్తిగత సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశముంది. ఇంటికి సంబంధించి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఇష్టదేవతలను ప్రార్థిస్తే మంచి కలుగుతుంది.

వృషభ రాశి

శ్రమను, కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగితే మంచి ఫలితాలుంటాయి. కొద్దిగా ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు . ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. చంద్ర ధ్యానం శుభప్రదం.

మిథునరాశి

ఈరాశివారు ఉద్యోగంలో ప్రమోషన్లు పొందే అవకాశం. స్నేహితులు, సన్నిహితుల సహకారంతో సహకారంతో వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలు అందుకుంటారు, మొహమాటం, భేషజాలకు దూరంగా ఉంటే మంచిది. అనవసరఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లక్ష్మీ నామాన్ని జపించడం వల్ల మంచి కలుగుతుంది.

కర్కాటక రాశి

వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ పనితీరు పై వారిని మెప్పిస్తుంది. సంతానాభివృద్ధికి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే శుభం కలుగుతుంది.

సింహ రాశి

ఈరాశి వారికి పట్టుదల ఎక్కువ. అనుకున్నది చేసి చూపిస్తారు. అదే సమయంలో అత్యుత్సాహంతో అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

కన్య రాశి

సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఇతరుల చెప్పుడు మాటలను వినకండి. ఈరాశి వారికి ఈరోజు ప్రయాణాలలో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ప్రార్థిస్తే మంచి కలుగుతుంది.

తుల రాశి

వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి సాధించేందుకు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే అనువైన సమయం. చేపట్టిన పనులు, కార్యక్రమాలు త్వరగా పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఇష్టదేవతలను ప్రార్థిసే శుభం కలుగుతుంది.

వృశ్చిక రాశి

మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితం పరంగా కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఈరాశి వారు ఈరోజు అనూహ్య ధనలాభాన్ని పొందుతారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆరాధిస్తే ఇంకా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి.

ధనస్సు రాశి

తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఏవీ త్వరగా పూర్తికావు. ఇతరులతో అనవసరంగా మాటలు పడతారు.దుర్గాదేవిని ప్రార్థిస్తే మంచి జరుగుతుంది.

మకర రాశి

శ్రమకు తగ్గ ఫలితం సిద్ధిస్తుంది. జీవితానికి సంబంధించిన ముఖ్య వ్యవహారాలపై కీలక వ్యక్తులను కలుస్తారు. నిర్ణయాలు, ఫలితాలు మీకు అనుకూలంగానే వెలువడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఆంజనేయ స్వామి స్తోత్రం పారాయణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి.

కుంభ రాశి

ఈరాశివారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అయినా పట్టుదల విలవకుండా ముందుకు సాగాలి. ఉన్నతోద్యోగులు, అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దక్షిణామూర్తి స్తోత్రం ఫఠిస్తే మంచి కలుగుతుంది.

మీన రాశి

ఈరోజు దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. అయినా మన ప్రయత్నం బలంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచనల్లో స్థిరత్వం లేకపోవడం వల్ల తరచూ ఇబ్బందులు పడతారు. దుర్గాదేవి అష్టోత్తరం చదవడం వల్ల అనుకున్నవి సాధిస్తారు.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో