AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 4 రాశులవారు పదేపదే ప్రేమలో పడుతుంటారు.. అందులో మీరున్నారా.!

జోతిష్యశాస్త్రం, రాశిచక్రాలపై చాలామందికి నమ్మకం ఉండదు. కానీ కొందరు మాత్రం వీటిని విశ్వసిస్తారు. ఇదిలా ఉంటే..

Zodiac Signs: ఈ 4 రాశులవారు పదేపదే ప్రేమలో పడుతుంటారు.. అందులో మీరున్నారా.!
Ravi Kiran
|

Updated on: Mar 08, 2022 | 10:47 PM

Share

జోతిష్యశాస్త్రం, రాశిచక్రాలపై చాలామందికి నమ్మకం ఉండదు. కానీ కొందరు మాత్రం వీటిని విశ్వసిస్తారు. ఇదిలా ఉంటే.. జీవితంలో ఎవరి పట్ల అయినా చాలా త్వరగా ఆకర్షితులయ్యే వ్యక్తులు కొంతమంది ఉన్నారట. ఇలాంటి వ్యక్తులు పదేపదే ప్రేమలో పడతారట. మరి ఆ వ్యక్తులు ఏ రాశులకు చెందినవారో ఇప్పుడు చూద్దాం..

మిధునరాశి:

ఈ రాశివారు పదేపదే ప్రేమలో పడుతుంటారు. వారి స్వభావం చాలా చంచలమైనది. దేనినైనా కూడా పొందాలనుకునే ఈ రాశి వ్యక్తులు.. ఒక్కసారి అనుకున్న దాన్ని పొందిన తర్వాత.. దాని గురించి పట్టించుకోవడం మానేస్తారు. వీరిలోని ఈ స్వభావం కొన్నిసార్లు వారిని తప్పుదారి పట్టిస్తుంది. ఈ వ్యక్తులు స్నేహం చేయడంలో నిష్ణాతులు. స్వచ్చమైన ప్రేమను వెతుక్కుంటూ.. పదేపదే ప్రేమలో పడుతుంటారు. కానీ ప్రతీ చోటా పరాజయం పొందుతారు. అయితే, వివాహం తర్వాత, ఈ వ్యక్తులు తమ జీవిత భాగస్వామితో పూర్తి నిజాయితీగా ఉంటారు.

వృషభం:

వృషభ రాశి వారికి ప్రేమ చాలా ముఖ్యం. జీవితంలో ఎవరి పట్లా అంత సీరియస్‌గా ఉండరు. ఎవరినైనా త్వరగా ఆకట్టుకోగలరు. అంతేకాకుండా ఆకర్షణనే ప్రేమ అనుకుని భ్రమ పడతారు. అందుకే వీరి బంధాలు ఎక్కువ కాలం ఉండవు. అందుకే జీవితంలో చాలాసార్లు ప్రేమలో పడతారు. కానీ ఈ వ్యక్తులు ఎవరినైనా సీరియస్‌గా ప్రేమిస్తే.. కన్నెత్తి కూడా వేరొకరిని చూడరు. తమ జీవిత భాగస్వామి పట్ల విధేయతతో నడుచుకుంటారు.

తులారాశి

ఈ రాశివారు తమ బంధం పట్ల పూర్తి నిజాయితీతో ఉంటారు. అయితే వీరి అతిపెద్ద సమస్య ఏమిటంటే, త్వరగా ఇతరులపై అధికారం చలాయించడం.. దీని కారణంగా వీరి బంధంలో తరచు గొడవలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితిలో వీరి బంధాలు కొన్నిసార్లు విచ్ఛిన్నమవుతాయి కూడా. అందుకే ఈ రాశివారు అనేకసార్లు ప్రేమలో పడుతుంటారు. ప్రతీసారి తమ రిలేషన్ నుంచి ఏదొకటి నేర్చుకుంటుంటారు.

కుంభరాశి

ఈ రాశివారు స్వేచ్చా మనస్సు కలిగి ఉంటారు. వీరు తరచు గందరగోళానికి గురవుతుంటారు. పదేపదే ప్రేమలో పడుతుంటారు. అయినప్పటికీ వీరి స్వేచ్చకు మాత్రం ఆటంకం కలగకూడదు. ఈ కారణం వల్ల అనేకసార్లు ఈ రాశి వ్యక్తుల ప్రేమ బంధంలో సమస్యలు ఏర్పడతాయి. ఒకవేళ ప్రేమ కావాలా.. స్వేచ్చ కావాలా అంటే.. ఈ రాశివారు స్వేచ్చనే ఎంచుకుంటారు. అందుకే వీరికి త్వరగా బ్రేకప్‌లు అవుతాయి. ఇలాంటి వ్యక్తులకు ప్రేమ ఇవ్వడంతో పాటు పూర్తి స్వేచ్ఛనిచ్చే భాగస్వామి కావాలి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.