AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారికి అనవసర ఖర్చులు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (09-03-2022): కొత్త పనులు, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా రోజులో ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు.

Horoscope Today: ఈ రాశివారికి అనవసర ఖర్చులు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Basha Shek
|

Updated on: Mar 09, 2022 | 6:36 AM

Share

Horoscope Today (09-03-2022): కొత్త పనులు, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా రోజులో ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. మంచి ముహూర్తం గురించి వెతుకుతారు. ఇందులో భాగంగా చాలామంది తమ దినఫలాల (Horoscope)వైపు దృష్టి సారిస్తారు. మరి ఈరోజు (మార్చి 9వ తేదీ ) బుధవారం (Wednesday) రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేషం

‘శ్రమయేవ జయతే’ అన్నట్లు శ్రమిస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి. అవసరానికి సహాయం చేసే సన్నిహితులు, స్నేహితులుండడం వీరి అదృష్టం. విద్య, కెరీర్‌లకు సంబంధించి ఇక శుభవార్త వింటారు. అదే సమయంలో ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. పరమేశ్వరుడిని ప్రార్థిస్తే శుభం కలుగుతుంది.

వృషభం

ఈరాశి వారికి ఈరోజు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి . నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే అనవసర విషయాల్లో తలదూర్చకపోవడమే ఉత్తమం. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. శని శ్లోకం పఠిస్తే బాగుంటుంది.

మిథునం

మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. అప్పగించిన పనుల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా పనులు త్వరగా పూర్తవుతాయి. అయితే అనవసర మాటలు, పట్టింపులతో లేనిపోని తలనొప్పులు వస్తాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి.

కర్కాటకం

ఈరాశి వారికి ఓర్పు, సహనం చాలా అవసరం. పనులు ప్రారంభించబోయే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. బంధువులతో ఆచి తూచి మాట్లాడాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలి. ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. నవగ్రహాలను దర్శిస్తే శుభప్రదం.

సింహం

ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. స్నేహితులు, సన్నిహితుల సహకారంతో ఇబ్బందులు, ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇష్టదైవతలను ఆరాధిస్తే మంచి కలుగుతుంది.

కన్య

అప్పగించిన బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు, సహకారంతో చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. అయితే శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. ఇష్టదైవారాధన మంచి ఫలితాలను అందిస్తుంది.

తుల

ఈరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసర విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. గోవులను పూజించడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు .

వృశ్చికం

సన్నిహితులు, స్నేహితుల నుంచి అవసరానికి తగిన సాయం అందుతుంది. కుటుంబసభ్యుల మాటలు వింటే మంచి కలుగుతుంది. అందరిని కలుపుకొనిపోతే అనుకున్న లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. ఇష్టదైవతలను పూజిస్తే శుభం కలుగుతుంది.

ధనుస్సు

ఈరాశివారు ఈరోజు కాస్త అప్రమత్తంగా ఉండాలి. కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచించాలి. లేకపోతే ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. శని దేవుడు, శ్లోకాలను పఠిస్తే మంచి ఫలితాలు అందుకుంటారు.

మకరం

ప్రారంభించిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేశారు. ఉన్నోతోద్యోగులు, బాస్‌లు, అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బుద్ధిబలంతోసమస్యలను పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సహకారంతో మంచి ఫలితాలు అందుకుంటారు. శివుడిని ప్రార్థిస్తే శుభం కలుగుతుంది.

కుంభం

ఈరాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర విషయాలు, వ్యవహారాల్లోకి తలదూల్చకూడదు. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. ప్రయాణాల విషయాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. శని దేవుడిని ఆరాధిస్తే అనుకూల ఫలితాలను అందుకుంటారు.

మీనం

విందులు,వినోదాలతో కాలాన్ని గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో వెన్నంటి ఉంటే మంచి విజయాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు, సహకారంతో లాభిస్తుంది. దుర్గా దేవిని ఆరాధిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:Kim Jong-un: దూకుడు పెంచిన కిమ్ మామ.. అక్కడ అణు పరీక్షలకు ఏర్పాట్లు..

KVP – Post Office FD: కేవీపీ, పోస్ట్ ఆఫీసు ఎఫ్‌డీ లో ఏది బెస్ట్?.. వడ్డీ రేటు ఎలా ఉంది.. వివరాలు మీకోసం..

గడ్డిఅన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌ కూల్చివేతల తీరు దురదృష్టకరం.. కోర్టు ధిక్కరణపై హైకోర్టు ఆగ్రహం