KVP – Post Office FD: కేవీపీ, పోస్ట్ ఆఫీసు ఎఫ్‌డీ లో ఏది బెస్ట్?.. వడ్డీ రేటు ఎలా ఉంది.. వివరాలు మీకోసం..
KVP - Post Office FD: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలు దాదాపుగా పోస్టల్ బ్యాంకులోని వివిధ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు.
KVP – Post Office FD: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలు దాదాపుగా పోస్టల్ బ్యాంకులోని వివిధ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. పోస్ట్ ఆఫీసులోనే అనేక పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆడ పిల్లల కోసం, పిల్లల చదువు కోసం, చిన్న వ్యాపారాలు సహా అనేక అవసరాల కోసం పెట్టుబడిదారులు వీటిలో పెట్టుబడులు, పొదుపు చేస్తుంటారు. ప్రజల సౌకర్యార్థం పోస్ట్ బ్యాంకు కూడా అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా పొదుపు పథకాలను తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏ పథకంలో పెట్టుబడులు పెట్టాలో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇలాంటి కీలక పథకాల్లో కిసాన్ వికాస్ పత్ర(KVP), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా(POTD) ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఈ పోస్ట్ ఆఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో వేటిలో పెట్టుబడులు పెడితే మంచిది.. వేటి ప్రయోజనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్..(TD) బ్యాంక్ ఎఫ్‌డిల మాదిరిగానే పోస్ట్ ఆఫీసుల్లోనూ టైమ్ డిపాజిట్లు చేయొచ్చు. టర్మ్ డిపాజిట్ (TD) 1 నుంచి 5 సంవత్సరాల వరకు ఎన్ని సంవత్సరాల కాల పరిమితితో అయినా డిపాజిట్ చేయొచ్చు. పది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇక 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. ఈవడ్డీ రేటును త్రైమాసికానికి లెక్కిస్తారు. రేట్లు ప్రభుత్వ సెక్యూరిటీల రాబడిపై ఆధారపడి ఉంటాయి. కాగా, ఈ టర్మ్ డిపాజిట్లకు వడ్డీ వారానికోసారి లెక్కిస్తారు. కానీ చెల్లించడం మాత్రం వార్షికానికి చెల్లిస్తారు. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1000 కాగా, గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఇక ఈ పథకానికి 6.7 శాతం వడ్డీ రేటు ఇస్తుండగా.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది.
80C ప్రకారం పన్ను ప్రయోజనాలివే.. భారత ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C ప్రకారం ఈ పథకం ద్వారా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో పెట్టిన డిపాజిట్, మెచ్యూరిటీకి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.
కిసాన్ వికాస్ పత్ర (KVP).. ఈ పథకాన్ని 1988లో ఇండియా పోస్ట్ ప్రారంభించింది. ఇది చిన్న మొత్తాల పొదుపు పథకం. ప్రజలు దీర్ఘకాలిక ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించుకోవడం దీని ప్రధాన లక్ష్యం. ఇది పోస్టాఫీసు కీలక పథకాల్లో పొదుపు కార్యక్రమాలలో ఒకటి. సురక్షితమైన పెట్టుబడికి దీనిని ఎంచుకోవచ్చు. KVPలో మీ డబ్బు మెచ్యూర్ అయినప్పుడు రెట్టింపు అవుతుంది. KVPలో కనిష్టంగా రూ. 1,000 పెట్టుబడి ఉంటే.. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. ఈ పథకంలో వార్షిక వడ్డీ రేటు 6.9%. 124 నెలల (10 సంవత్సరాల 4 నెలలు) తర్వాత ఈ పెట్టుబడి రెండింతలు అవుతుంది. పెట్టుబడి కాల పరిమితి అనేది స్థీకరించలేదు. ప్రస్తుతం గరిష్ట కాలపరిమితి 118 నెలలుగా ఉంది.
పన్ను ప్రయోజనం.. వడ్డీని ప్రతి సంవత్సరం తిరిగి పెట్టుబడిగా పెట్టవచ్చు. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపునకు అర్హమైనది. NSC పెట్టుబడులకు గరిష్ట పరిమితి లేనప్పటికీ, సెక్షన్ 80 C కింద పన్ను ప్రయోజనం ప్రతి ఆర్థిక సంవత్సరం రూ. 1.5 లక్షలకు పరిమితం చేయబడింది.
Also read:
Zodiac Signs: ఈ 4 రాశులవారు పదేపదే ప్రేమలో పడుతుంటారు.. అందులో మీరున్నారా.!
Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఆ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశం!!
Smart Phones: రూ. 5 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలివే..