Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Phones: రూ. 5 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలివే..

Smart Phones: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్స్ లేని వారుండరంటే అతిశయోక్తి కాదు. కొందరైతే రెండు స్మార్ట్ ఫోన్లను కూడా వినియోగించేవారూ ఉన్నారు.

Smart Phones: రూ. 5 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలివే..
Smart Phones
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 08, 2022 | 10:13 PM

Smart Phones: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్స్ లేని వారుండరంటే అతిశయోక్తి కాదు. కొందరైతే రెండు స్మార్ట్ ఫోన్లను కూడా వినియోగించేవారూ ఉన్నారు. కొందరు స్మార్ట్ ఫోన్లంటే పచ్చి ఉంటుంది. మార్కెట్‌లోకి విడుదలైన ప్రతి ఫోన్‌ను కొనేస్తుంటారు. మరికొందరు తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్స్ కలిగిన ఫోన్ల కోసం ఎదురు చూస్తుంటారు. అందుకే స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా ప్రజల అవసరాలు, ఇష్టాలు, అభిరుచులకు అనుగుణంగా సరికొత్త మోడళ్లను మార్కెట్‌లోకి వదులుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ‘లావా’ సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ స్మార్ట్ ఫోన్.. ధర కేవలం రూ.5,299 మాత్రమే ఉండటం విశేషం. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ధర తక్కువ మాత్రమే కాదు.. ఫీచర్స్ చూస్తే అదుర్స్ అనేలా ఉన్నాయి. LAVA Z21 పేరుతో మార్కెట్‌లోకి విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంది.

LAVA Z21 ఫీచర్స్.. బ్యాటరీ కెపాసిటీ: 3100 mAH స్టోరేజీ: 2 GB RAM, 32 GB ROM డిస్‌ప్లే: 5 అంగుళాలు. 4జీ సపోర్ట్, 2 సిమ్స్ సపోర్ట్. అక్టాకోర్ ప్రాసెసర్‌ కలిగిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ సపోర్ట్, వైఫై, యూఎస్‌బి కనెక్టివిటీ ఉంది.

ప్రత్యేక ఆఫర్.. LAVA Z21 స్మార్ట్‌ఫోన్‌పై ప్రముఖ ఇ-కామర్స్ సైట్ Amazonలో అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్‌ను ప్రకటించింది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌లో పెట్టి.. LAVA Z21 కొనుగోలు చేయవచ్చు. HSBC కార్డ్‌తో షాపింగ్ చేస్తే 5% క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఇక ఈఎంఐ సదుపాయం కూడా ఇచ్చింది.

Also read:

Water Bubbles: నీటి బుడగలు గుండ్రంగా ఎందుకు ఉంటాయి.. దాని వెనుకున్న కారణం ఏమిటి..?

Imran Khan: ఇమ్రాన్ ఇక దిగిపో చాలు.. పాకిస్తాన్ ప్రధానికి మొదలైన పదవీగండం

Viral Video: పెళ్లి పీటల మీద సడెన్ ట్విస్ట్ ఇచ్చిన వరుడు.. బిత్తరపోయిన కుటుంబసభ్యులు.. అసలేమైందంటే