- Telugu News Photo Gallery Science photos Have you ever wondered why bubbles are always round? What are the things that make bubbles and how
Water Bubbles: నీటి బుడగలు గుండ్రంగా ఎందుకు ఉంటాయి.. దాని వెనుకున్న కారణం ఏమిటి..?
Water Bubbles: చిన్నతనంలో చాలా మంది నీటి బుడగలతో ఆడుకునే ఉంటారు. ఈ రోజుల్లో కూడా పిల్లలు నీటి బుడగలతో ఆడుకోవడం చూస్తూనే ఉంటాము. ఈ బుడగలు సబ్బు నీటి ద్వారా ఏర్పడుతుంటాయి...
Updated on: Mar 08, 2022 | 10:06 PM

Water Bubbles: చిన్నతనంలో చాలా మంది నీటి బుడగలతో ఆడుకునే ఉంటారు. ఈ రోజుల్లో కూడా పిల్లలు నీటి బుడగలతో ఆడుకోవడం చూస్తూనే ఉంటాము. ఈ బుడగలు సబ్బు నీటి ద్వారా ఏర్పడుతుంటాయి. ఇవి కొంతసేపు గాలిలో ఎగిరిపోయి తర్వాత పగిలిపోతాయి. ఇలా చాలా మంది పిల్లలు ఆడుకోవడం తరచూ చూస్తూనే ఉంటాము. అలాగే నీటిలో కూడా బుడగలు ఏర్పడుతుంటాయి.

వర్షపు నీటిలో, సోడా కలిపిన నీటిలో, ఇతర ద్రవాలలో కూడా బుడగలు ఏర్పడుతుంటాయి. కానీ అవన్ని గాలిలో ఎగరలేవు. ఇదే కాకుండా సబ్బుతో తయారైన బుడగలలో పలు రంగులు కూడా ఉంటాయి. అయితే ఈ బుడగల వెనుక ఉన్న ఆంతర్యమేమిటో చూద్దాం.

సాధారణంగా బుడగల గురించి పెద్దగా మాట్లాడరు. అయితే చిన్నతనంలో బుడగలు ఆకర్షణీయంగా ఉంటాయి. బుడగలు అనేవి మన చిన్ననాటితనం నుంచే ముడిపడి ఉంటాయి. బుడగల గురించి రెండు ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతుంటాయి.

బుడగలు ఎలా ఏర్పడతాయి..?: నిజానికి బుడగలు సబ్బు నీటితో ఏర్పడినప్పుడు బుడగ మధ్యలో గాలి నిండి ఉంటుంది. అది ఎగిరే కొద్ది అవిరైపోతుంది. దీంతో బుడగ చిన్న పొరగా మారి చివరికి పగిలిపోతుంది. సబ్బు నీరు, ద్రవణంతో చేసిన పొరలో గాలి నిండినప్పుడు బుడగ ఏర్పడుతుంది. అయితే సబ్బు, నీటి ద్రవణంతో తయారు చేసిన బుడగలు పారదర్శకంగా ఉంటాయి.

బుడగలు గుండ్రంగానే ఎందుకుంటాయి..?: నీరు, సబ్బు ద్రవణం ద్వారా ఏర్పడిన బుడగలలో కొంత మొత్తంలో గాలి నిండి ఉంటుంది. నీరు, సబ్బు బుడగలు అణువులతో రూపొంది ఉంటుంది. బుడగలుగా ఏర్పడగానే.. అవి ఒకదానికొకటి సమాన శక్తితో తమ వైపునకు లాగుతాయి. అందుకే బుడగలు ఎప్పుడూ గుండ్రంగా ఉండడానికి కారణం. దీనిని మరో విధంగా అర్ధం చేసుకోవచ్చు. బబుల్ లోపల ఉన్న గాలి అణువులు బయట గాలి అణువులతో అదే శక్తిని అనుభవిస్తాయి. దీనికి కారణం లోపల ఉండే గాలి అణువులు క్లస్టర్‌లను ఏర్పరుస్తాయి.

ఇవి బయటి గాలితో సంబంధాన్ని తగ్గిస్తాయి. అందుకే బుడగలు ఎప్పుడు గుండ్రంగా ఉంటాయి. గాలిలో ఎగురుతున్న బుడగ.. గాలి ఒత్తిడి ఉన్నా.. అందులో ఉండే గాలి కారణంగా బయట గాలి ఒత్తిడిని తగ్గించుకునే గుణం ఉంటుంది. ఒక వేళ గాలి ఎక్కువగా వీచినా లోపల ఉన్న గాలి సమానంగా వ్యాపిస్తూ లాగుతూ ఉంటుంది. అందుకే బుడగ గుండ్రంగా ఉంటుంది.





























