Imran Khan: ఇమ్రాన్ ఇక దిగిపో చాలు.. పాకిస్తాన్ ప్రధానికి మొదలైన పదవీగండం

పాకిస్తాన్‌ ప్రధాని( Pakistan PM) ఇమ్రాన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నాయి విపక్షాలు. అధిక ధరలను అరికట్టడంలో విఫలమైన ఇమ్రాన్‌(Imran Khan) గద్దె దిగాలని డిమాండ్‌ చేశాయి. పాక్‌ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో..

Imran Khan: ఇమ్రాన్ ఇక దిగిపో చాలు.. పాకిస్తాన్ ప్రధానికి మొదలైన పదవీగండం
Imran Khan
Follow us

|

Updated on: Mar 08, 2022 | 9:59 PM

పాకిస్తాన్‌ ప్రధాని( Pakistan PM) ఇమ్రాన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నాయి విపక్షాలు. అధిక ధరలను అరికట్టడంలో విఫలమైన ఇమ్రాన్‌(Imran Khan) గద్దె దిగాలని డిమాండ్‌ చేశాయి. పాక్‌ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు పదవీగండం వచ్చింది. ఇమ్రాన్‌ తన పదవికి 24 గంటల్లోగా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దేశంలో పరిపాలన దయనీయంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేదని విపక్షాలు ఆరోపించాయి. ఇమ్రాన్‌ ప్రభుత్వంపై పాక్‌ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. రెండు మూడు రోజుల్లో అవిశ్వాస తీర్మానంపై స్పీకర్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అత్తెసరు మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఇమ్రాన్‌.

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు భారీ ర్యాలీ తీశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేదంటే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనాలని హెచ్చరించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదని అన్నారు విపక్ష నేతలు . ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందని, కరంట్ అకౌంట్ లోటు పెరిగిందని, విదేశీ మారక ద్రవ్యం నిల్వలు క్షీణిస్తున్నాయని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ 2018లో ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. పాకిస్థాన్ సైన్యం సహకారంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆయన ప్రభుత్వానికి సైన్యం మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కానీ ఈ ఆరోపణలను సైన్యం, ఇమ్రాన్ తోసిపుచ్చారు.

ప్రతిపక్షాల డిమాండ్లను ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. పెట్రోలు, డీజిల్ ధరలను, విద్యుత్తు ఛార్జీలను తగ్గించారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడితే, అందుకు పర్యవసానాలను ఎదుర్కొనవలసి వస్తుందని ప్రతిపక్షాలను హెచ్చరించారు. పాకిస్థాన్ పార్లమెంటు సాధారణ ఎన్నికలు 2023లో జరగవలసి ఉంది.

ఇవి కూడా చదవండి: Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులకు ఊరట.. సుమీ నుంచి తరలింపు ప్రారంభం..