Viral Video: కీవ్ అండ‌ర్‌గ్రౌండ్‌ మెట్రోలో ప్ర‌స‌వించిన మ‌హిళ‌.. మెట్రో స్టేషన్లనే బంక‌ర్లుగా వాడుతున్న స్థానికులు .. వీడియో

Viral Video: కీవ్ అండ‌ర్‌గ్రౌండ్‌ మెట్రోలో ప్ర‌స‌వించిన మ‌హిళ‌.. మెట్రో స్టేషన్లనే బంక‌ర్లుగా వాడుతున్న స్థానికులు .. వీడియో

Anil kumar poka

|

Updated on: Mar 08, 2022 | 10:06 PM

రష్యా విరుచుకుపడటంతో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ పై మూడవ రోజు బాంబుల‌ వ‌ర్షం కొన‌సాగుతూనే ఉన్న‌ది. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డేందుకు స్థానికులు అండ‌ర్‌గ్రౌండ్ మెట్రో స్టేష‌న్‌లో త‌ల‌దాచుకుంటున్నారు. ఆ మెట్రో స్టేష‌న్లే ఇప్పుడు బాంబు షెల్ట‌ర్లు. అక్క‌డ త‌ల‌దాచుకుంటున్న


రష్యా విరుచుకుపడటంతో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ పై మూడవ రోజు బాంబుల‌ వ‌ర్షం కొన‌సాగుతూనే ఉన్న‌ది. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డేందుకు స్థానికులు అండ‌ర్‌గ్రౌండ్ మెట్రో స్టేష‌న్‌లో త‌ల‌దాచుకుంటున్నారు. ఆ మెట్రో స్టేష‌న్లే ఇప్పుడు బాంబు షెల్ట‌ర్లు. అక్క‌డ త‌ల‌దాచుకుంటున్న ఓ గ‌ర్భిణి ప్ర‌స‌వించింది. బేబీకి జ‌న్మ‌నిచ్చిన‌ట్లు టెలిగ్రామ్ యాప్‌లో కొంద‌రు ఈ విష‌యాన్ని షేర్ చేశారు. మెట్రో స్టేష‌న్ల‌నే బంక‌ర్లుగా వాడుతున్న స్థానికులు ప్ర‌స్తుతం టెలిగ్రామ్ యాప్ ద్వారా క‌మ్యూనికేట్ చేసుకుంటున్నారు. అండ‌ర్ గ్రౌండ్ మెట్రో రైళ్లు న‌డుస్తున్నాయి. కాగా జనం ఫ్లాట్‌ఫామ్‌ల‌ను ఆవాసాలుగా మార్చుకుని బిక్కుబిక్కుమంటూ రోజులు గ‌డుపుతున్నారు.కాగా గురువారం ఒక్క రోజే 35వేల మంది పోలాండ్‌లోకి ప్ర‌వేశించారు. రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల‌కు ఉక్రెయిన్ శ‌ర‌ణార్థులు వెళ్తున్నారు. ర‌ష్యా దాడుల వ‌ల్ల ఇప్ప‌టికే ల‌క్ష మంది చెల్లాచెదుర‌య్యారు. దాదాపు 50 ల‌క్ష‌ల మంది ఉక్రెనియ‌న్లు విదేశాల‌కు త‌ర‌లివెళ్లే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితి అంచ‌నా వేస్తోంది.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్