Spider Woman : స్పైడర్ ఉమెన్ షాకింగ్ సీన్.. చూస్తే కళ్లు బైర్లే..! అసలు విషయం తెలిస్తే కోపంతో రగిలిపోతారు.. వీడియో.
ఇంట్లోని కిటికిని శుభ్రం చేయడానికి ఓ మహిళ చేసిన సాహసం సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. స్పైడర్ ఉమెన్‌గా మారి ఆ మహిళ చేసిన పనికి స్థానికులే కాదు, నెటిజన్లు సైతం కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈ ఘటన గజియాబాద్‌లో చోటు చేసుకుంది. స్థానిక శిప్రా రివేరా సొసైటీలో
ఇంట్లోని కిటికిని శుభ్రం చేయడానికి ఓ మహిళ చేసిన సాహసం సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. స్పైడర్ ఉమెన్‌గా మారి ఆ మహిళ చేసిన పనికి స్థానికులే కాదు, నెటిజన్లు సైతం కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈ ఘటన గజియాబాద్‌లో చోటు చేసుకుంది. స్థానిక శిప్రా రివేరా సొసైటీలో గల నాల్గవ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌లో ఓ మహిళా నివాసం ఉంటుంది. అయితే, ఇంటిని శుభ్రంగా ఉంచుకునే క్రమంలో ఫ్లాట్‌కు వెనకాల ఉన్న కిటికి అద్దాలను శుభ్రం చేయాలనుకుందా మహిళ. సాధారణంగా ఎవరైనా ఏదైనా కర్రతోనో, మరో క్లీనింగ్ పరికరంతో శుభ్రం చేస్తారు. కానీ ఈమే మాత్రం స్పైడర్ ఉమెన్‌లా మారిపోయింది. కిటికి ముందు ఉండే ఆ కాసింత స్థలంలోనే నిలబడి ఎంచక్కా కిటికిని శుభ్రం చేసింది. ఈ సమయంలోనే ఆ మహిళ నివాసం ఉంటున్న ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లోని మరో మహిళ ఈ విషయాన్ని గమనించారు. అలా చేయడం ప్రమాదకరమని చెప్పడానికి ఎంత పిలిచినా స్పందించలేదా ఆ మహిళ. దీంతో ఆమె తన కూతురును కిటికి క్లీనింగ్ చేస్తున్న ఫ్లాట్‌కు పంపించి ఆమెను లోపలికి రప్పించారు. ఇదే సమయంలో మహిళ కిటికి శుభ్రం చేస్తున్నదంతా స్మార్ట్ ఫోన్‌లో బంధించారు. ఈ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది. కిటికి శుభ్రం చేయడానికి ప్రాణాలు పణంగా పెట్టడం అవసరమా.? అంటూ నెటిజన్లు కాసింత ఘాటుగానే స్పందిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

