Kim Jong-un: దూకుడు పెంచిన కిమ్ మామ.. అక్కడ అణు పరీక్షలకు ఏర్పాట్లు..

Kim Jong-un: ఉత్తర కొరియా త్వరలో అణు పరీక్షలకు(Nuclear Tests) సిద్ధమవుతున్నట్లు అమెరికా అంచనావేస్తోంది. ఉత్తర కొరియాలోని(North Korea) కొన్ని నిర్మాణాలకు సంబంధించి లభించిన శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు అమెరికాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తెలిపింది.

Kim Jong-un: దూకుడు పెంచిన కిమ్ మామ.. అక్కడ అణు పరీక్షలకు ఏర్పాట్లు..
Nuclear Test
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 09, 2022 | 6:34 AM

Kim Jong-un: ఉత్తర కొరియా త్వరలో అణు పరీక్షలకు(Nuclear Tests) సిద్ధమవుతున్నట్లు అమెరికా అంచనావేస్తోంది. ఉత్తర కొరియాలోని(North Korea) కొన్ని నిర్మాణాలకు సంబంధించి లభించిన శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు అమెరికాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఉత్తర కొరియా చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచానికి పెనుముప్పుగా మారే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. డీఎన్ఐ అంచనా ప్రకారం.. ఉత్తర కొరియాలోని యోంగ్‌బియాన్ ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అణు పరీక్షలు జరపటానికి అనువుగా తాజా నిర్మాణాలు ఉన్నాయని అగ్రరాజ్యం అంచనాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో చివరిసారిగా 2017లో అణు పరీక్షలు జరిగాయి. 2018లో దీన్ని మూసివేశారు. అప్పటి నుంచి ఆ ప్రదేశంలో ఎలాంటి కదలికలు లేవు.

కానీ ప్రస్తుతం.. కొత్తగా నిర్మాణాలు జరుగుతున్నట్లు అమెరికా గుర్తించింది. ఈ ప్రదేశంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షతో పాటు అణు పరీక్షలు జరిపేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్‌తోపాటు, సబ్‌మెరైన్ నుంచి ప్రయోగించగలిగే క్షిపణుల్ని సైతం ఉత్తర కొరియా అభివృద్ది చేస్తోంది. ప్రధానంగా అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ చేపడుతున్న ఈ చర్యలు అమెరికా అధ్యక్షుడు జో బైడైన్‌కు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టనున్నాయని అంతర్జాతీయ వ్వవహారాల విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా కిమ్ తనదైన దూకుడుతో అమెరికాకు కొరకరాని కొయ్యగా తయారయ్యారని చెప్పుకోవాల్సిందే.

ఇవీ చదవండి..

Steel: భారత్ కు యుద్ధం తెచ్చిన కొత్త అవకాశం.. కానీ దేశీయ వినియోగదారులపై పెరుగుతున్న భారం..

Gold Rates: పైపైకి పోతున్న ప్రీషియస్ మెటల్ ధర.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..