AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 5 రాశుల వారు చాలా అజాగ్రత్తపరులు.. నిర్లక్ష్యంగా ఉంటారు.. అందులో మీరున్నారా తెలుసుకోండి

Zodiac Signs: ఒక వ్యక్తి గుణాలు, స్వభావం, వ్యక్తిత్వాన్ని రాశి చక్రం ప్రకారం నిర్ధారించవచ్చు. మన జీవితంలో నిర్లక్ష్యంగా ఉన్న వ్యక్తులను కలుస్తూనే ఉంటాం. ఆఫీసులో జరిగే మీటింగ్స్ ఆలస్యం, స్కూలు, కాలేజీలకు సమయానికి..

Zodiac Signs: ఈ 5 రాశుల వారు చాలా అజాగ్రత్తపరులు.. నిర్లక్ష్యంగా ఉంటారు.. అందులో మీరున్నారా తెలుసుకోండి
Zodiac Signs
Surya Kala
|

Updated on: Mar 09, 2022 | 12:49 PM

Share

Zodiac Signs: ఒక వ్యక్తి గుణాలు, స్వభావం, వ్యక్తిత్వాన్ని రాశి చక్రం ప్రకారం నిర్ధారించవచ్చు. మన జీవితంలో నిర్లక్ష్యంగా ఉన్న వ్యక్తులను కలుస్తూనే ఉంటాం. ఆఫీసులో జరిగే మీటింగ్స్ ఆలస్యం, స్కూలు, కాలేజీలకు సమయానికి వెళ్ళకపోవడం.. ఏపనిని సకాలంలో పూర్తి చేయక పోవడం ఇవన్నీ వారి నిర్లక్ష వైఖరికి గుర్తు.. ఇటువంటి వారిని ఎవరూ పెద్దగా ఇష్టపడరు. ఇలా నిర్లక్ష్య ధోరణికి కారణం రాశి యొక్క స్వభావం జోతిష్యంలో చెప్పబడింది. జ్యోతిషశాస్త్రంలో..  మొత్తం 12 రాశుల గురించి .. రాశుల గుణగణాల గురించి చెప్పబడింది. ఒక్కో రాశికి సంబంధించిన మంచి చెడులను వివరించింది. రాశిచక్రం (Astro ) ప్రకారం వ్యక్తి స్వభావాన్ని నిర్ధారించవచ్చు. ఈ  5 రాశుల(Five Zodiac Signs)  వారు చాలా అజాగ్రత్త పరులని జ్యోతిషశాస్త్రం పేర్కొంది. వీరి అజాగ్రత్త, అలవాటు చాలాసార్లు  వారిని.. వారితో పాటు ఇతరులను ఇబ్బందులకు గురిచేస్థాయి. ఈరోజు ఆ ఐదు రాశులు ఏమిటో తెలుసుకుందాం.

  1. వృశ్చికరాశి:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు చాలా అజాగ్రత్త పరులు. ఈ రాశికి చెందిన వారు తమ విషయాలను సరిగ్గా చూసుకోలేరు. అయితే ఈ రాశి వారు చాలా నిరాడంబరంగా ఉంటారు.  అవసరమైనప్పుడు ప్రజలకు సహాయం చేస్తారు. చాలా నిజాయితీపరులు. వీరి అజాగ్రత్త వలన అలవాటు వలన ఒక్కోసారి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
  2. ధనుస్సు రాశి: ఈ రాశి వారు చాలా సోమరిపోతులు. చాలా అజాగ్రత్త పరులు. వీరు చాలా తెలివైన వారు అయినప్పటికీ  జీవితమ్లో జరిగే విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు. ఎల్లప్పుడూ సత్యానికి మద్దతుగా నిలుస్తారు. తాము నమ్మిన దానిని ఆచరిస్తారు. వీరి అజాగ్రత్త స్వభావం వల్ల కొన్నిసార్లు సమస్యలను ఎదుర్కొంటారు.
  3. సింహరాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశిచక్రం ప్రజలు చాలా నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటారు. వారు తమ వస్తువులను కూడా అస్తవ్యస్తంగా ఉంచుకుంటారు. తమ గురించి కూడా పట్టించుకోరు. ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా నిజాయితీ పరులు. వీరు జీవితంలో ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. అయితే ఈ వీరు విజయం కోసం కష్టపడాల్సిన అవసరం లేకుండా సునాయాసంగా విజయాన్ని దక్కించుకుంటారు. అయితే వీరి అజాగ్రత్త స్వభావం ఈరాశివారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది.
  4. మీనరాశి: ఈ రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. అయితే ఈ రాశివారు చాలా  ఆశాజనకపరులు. తాము ఏపని మొదలు పెట్టినా అంతా సవ్యంగానే జరుగుతుందని వీరి నమ్మకం. అయితే కొన్నిసార్లు మెరుగైన స్థానం కోసం వీరు పడే  తపన అజాగ్రత్త పరులుగా నిలబెడుతుంది.
  5. మిధునరాశి: ఈ రాశి వారు చాలా చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏది కావాలంటే అది చేస్తారు. తర్వాత పరిణామాల గురించి పెద్దగా ఆలోచించరు. వీరి నిర్లక్ష్య వైఖరి కొన్నిసార్లు వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. అయితే, ఈ రాశి వారు చాలా ఓపెన్ మైండెడ్. ఏదీ మనసులో దాచుకోరు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Read Also: 

 అంగరంగ వైభవంగా జరిగిన సుడిగాలి సుధీర్ పెళ్లి.. అతిధులుగా హేమ, అన్నపూర్ణ హాజరు.. అలరిస్తున్న ప్రోమో..

అందమైన పెదాల కోసం అదిరే చిట్కాలు.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేయండి..!