Zodiac Signs: ఓటమిని అస్సలు ఒప్పుకోరు.. గెలవడం కోసం ఎంత దూరమైన వెళ్తారు. వీళ్లు చాలా డేంజర్..
పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన మార్గాన్ని అయినా చేధించవచ్చు అంటారు. కానీ కొందరు మాత్రం ఓటమిని అస్సలు ఒప్పుకోరు. తాము
పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన మార్గాన్ని అయినా చేధించవచ్చు అంటారు. కానీ కొందరు మాత్రం ఓటమిని అస్సలు ఒప్పుకోరు. తాము అనుకున్న పని పూర్తి చేయడానికి ఎంతదూరమైన వెళ్తారు. కొందురు మహిళలు ఎప్పుడూ ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. వీరి ఆలోచనలు ఎప్పుడూ తమ గురించి మాత్రమే ఉంటాయి. వీరికి భయపడడం తెలియదు.. అలాగే ప్రతి చిన్న అవకాశాన్ని.. పరిస్థితిని తమకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తుంటారు. అయితే నిజానికి ఇవి వారి రాశిచక్రంపై ఆధారపడి ఉంటుంది. జోత్యిష్యా శాస్త్రం ప్రకారం… కొందరు మహిళలు చాలా భయంకరమైన స్వభావం కలిగి ఉంటారు. వీళ్లు అన్ని విషయాల్లో నిజాయితీగా కనిపిస్తూ.. వారి ఆలోచనలను గట్టిగా వినిపిస్తారు. మరీ వాళ్లు ఎవరో తెలుసుకుందామా.
సింహ రాశి.. వీరు క్వీన్ ఆఫ్ ది జంగిల్. ఈరాశి మహిళలు.. చాలా ధైర్యంగా వారి ఆలోచనలు తెలియజేస్తారు. అలాగే వీరు ఎక్కువగా నటిస్తుంటారు. సింహాల మాదిరిగా ధైర్యంగా ఉంటారు. రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం భయపడరు. క్షణికావేశంలో వీరు తీసుకునే నిర్ణయాలు వీరిని .. వీరితోపాటు ఉన్నవారిని ఇబ్బందిపెడతాయని తెలిసినా అవేం పట్టించుకోరు. కానీ వారివరకు వచ్చిన సమస్యలను పరిష్కరించకుండా ఉండరు.
కన్య రాశి.. వీరు చాలా కఠినమైనవారు. పని పట్ల నిజాయితీ… అనుకున్న లక్ష్యాలను చేరడం కోసం ఎంతో కష్టపడతారు. గెలవడం కోసం సరైన దారిలో కాకుండా.. నియమనిబంధనలు ఉల్లంఘించి.. వక్రదారిలోనైనా.. వీరు గమ్యాన్ని చేరుకోవడానికి ఇష్టపడతారు. అలాగే..వీరు అనుకున్నది సాధించడం కోసం ఎంతో మార్యదపూర్వకంగా నటిస్తూ.. ఇతరులను మోసం చేస్తారు.
ధనుస్సు.. వీరు ఆశావాదులు. అలాగే ఎంతో తెలివైన ధైర్యవంతులు.. ధనుస్సు అనేది బృహస్పతిచే పరిపాలించే సంకేతం. వీరు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తప్పు అని తెలిసిన గెలవడానికి అదే దారిని ఎంచుకుంటారు. తెలివి.. మాటతీరుతో.. తన సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వీరు చాలా స్ట్రాంగ్.
మకర రాశి.. వీరు ఓటమిని అస్సలు అంగీకరించరు. వీరికి ఇష్టమైనవారిని రక్షించుకోవడానికి ఎంత దూరమైన వెళ్తారు. అలాగే వీరికి చాలా స్వీయ నియంత్రణ ఉంటుంది. వీరి మొండితనం.. స్వాతంత్రం.. ధైర్య సాహసాలు ఇతరుల నుంచి వీరిని దూరం చేస్తాయి. కానీ.. తమ అనుకున్నవారిపట్ల ఎంతో నిజాయితీగా ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అద్భుతమైన నాయకులు.. నిర్వాహకులు.. బాధ్యతగల పౌరులుగా తయారవుతారు. మనసులో ఏముందో నిర్మోహ్మటంగా చెప్పేస్తుంటారు.
Also Read: Pooja Hegde: ప్రభాస్..పూజా హెగ్డే మధ్య గొడవలు.. అసలు విషయం చెప్పేసిన టాలీవుడ్ బుట్టబొమ్మ..
Rajamouli: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర ట్వీట్స్.. ఏమన్నారంటే..
Poonam Kaur: పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్.. దర్శకుడు రాక్షసంగా ప్రవర్తించాడంటూ..