AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam Kaur: పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్.. దర్శకుడు రాక్షసంగా ప్రవర్తించాడంటూ..

కాస్త కూల్‌గా... ఇంకాస్త ఎమోషనల్‌ హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ చేసిన కామెంట్లు మళ్లీ టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయాయి. నిజంగా పూనమ్ దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారా? అంతలా ఆమెను వేధిస్తున్న రాక్షసుడెవరు?

Poonam Kaur: పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్..  దర్శకుడు రాక్షసంగా ప్రవర్తించాడంటూ..
Poonam Kaur
Ram Naramaneni
|

Updated on: Mar 09, 2022 | 3:55 PM

Share

Tollywood: కాస్త కూల్‌గా… ఇంకాస్త ఎమోషనల్‌ హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ చేసిన కామెంట్లు మళ్లీ టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయాయి. నిజంగా పూనమ్ దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారా? అంతలా ఆమెను వేధిస్తున్న రాక్షసుడెవరు? నాతి చరామి(Nathicharami) మూవీలో తను నటించిన శ్రీలత క్యారెక్టర్‌కి ఎందుకు కనెక్ట్ అయ్యారన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. పరిచయం అక్కర్లేని పేరు పూనమ్ కౌర్. సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులరయ్యారు. ఒక్కోసారి ట్వీట్లతో సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంది. అంతలోనే మళ్లీ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. తను ఏం చేసినా, మాట్లాడినా ఇండస్ట్రీలో కొద్దిరోజుల పాటు రచ్చ మాత్రం కంటిన్యూ అవుతుంది. తన జీవితాన్ని కొందరూ నాశనం చేశారని ఇప్పుడే కాదూ గతంలోనూ ఆరోపించారు పూనమ్‌. ధైర్యం కోసం సీత, దుర్గా, ద్రౌపదిలను తలచుకోవడమంటే ఆమె ఎంత నరకం అనుభవించిందో అర్థమవుతుంది. ప్రతీసారి పరోక్షంగా ఫలానా వాళ్లే కారణమని చెప్పే పూనమ్‌.. వాళ్ల పేర్లను మాత్రం బయటపెట్టడం లేదు. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా మనసులో మాట బయటపెడుతోంది. ఎందుకిలా అన్నది అర్థంకాని ప్రశ్న.

“పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా కొందరు రావణులు అడ్డుకున్నారన్నారు. ఇండస్ట్రీలో కొందరు పెద్దలు జీవితంలోకి వచ్చి నాశనం చేసి వెళ్లిపోయారు. ధైర్యం కోసం రోజూ సీత, దుర్గా, ద్రౌపదిలనే తలచుకున్నా. అలా చేయడం వల్ల చాలా శక్తిని, ధైర్యాన్ని పొందాను. ఈ భాదలను భరించలేక ఇక సినిమాలు చేయను, ఇండియా నుంచి వెళ్లిపోతా అనుకున్న సమయంలో.. నా ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి.. ఇలా ఒక ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీ ఉందని, ఇది రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉన్న కథ అని చెప్పడంతో ఈ సినిమాలో నటించాను” అని పూనమ్ కౌర్ పేర్కొన్నారు

సమాజంలో నెలకొన్న పరిస్థితులపై… సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై తన ట్విట్టర్‌లో స్పందిస్తుంటారు పూనమ్. ఆమె చేసే ట్వీట్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అంతేకాదూ.. ట్వీట్స్ క్షణాల్లో డిలీట్ చేయడంతో నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతుంటాయి. ఎప్పుడు పరోక్షంగా ట్వీట్ చేసే పూనమ్ కౌర్.. ఇప్పుడు నేరుగా ఓ డైరెక్టర్‎ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసింది. ఇంతకీ రాక్షసంగా ప్రవర్తించిన ఆ డైరెక్టర్‌ ఎవరు? ఎందుకు అంతలా వేధించాడన్నది మాత్రం పూనమ్ రివీల్ చేయడం లేదు.

Also Read: నయా బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సామ్‌.. నాగ చైతన్యకు పోటీగానే అంటోన్న నెటిజన్లు..