Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: ప్రభాస్..పూజా హెగ్డే మధ్య గొడవలు.. అసలు విషయం చెప్పేసిన టాలీవుడ్ బుట్టబొమ్మ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్ (Radhe Shyam). ఈ చిత్రాన్ని

Pooja Hegde: ప్రభాస్..పూజా హెగ్డే మధ్య గొడవలు.. అసలు విషయం చెప్పేసిన టాలీవుడ్ బుట్టబొమ్మ..
Pooja Hegde
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 09, 2022 | 3:27 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్ (Radhe Shyam). ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానరపై భారీ బడ్జెట్‏తో వంశీ ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న పూజా హెగ్డే (Pooja Hegde).. ప్రభాస్‏తో తనకు మధ్య ఏర్పడ్డ మనస్పర్థల గురించి స్పందించింది.

రాధేశ్యామ్ షూటింగ్ సమయంలో ప్రభాస్.. పూజా హెగ్డే మధ్య గొడవలు జరిగాయని.. దీంతో వారిద్దరూ మాట్లాడుకోవడం లేదని వార్తలు వినిపించాయి. పూజా హెగ్డే షూటింగ్ సమయంలో ప్రవర్తించిన తీరుతో చిత్రయూనిట్ అనేక ఇబ్బందులు ఎదుర్కోందని.. దీంతో ప్రభాస్ ఆమెపై సీరియస్ అయినట్లుగా గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అవన్ని రూమర్స్ మాత్రమే అంటూ యూవీ క్రియేషన్స్ కొట్టిపాడేసింది. అయితే ఇటీవల రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో పూజా హెగ్డే ప్రభాస్ మాట్లాడుకోకుండా.. ఎవరిదారి వారిదే అన్నట్టుగా ఉండడంతో మరోసారి వీరిద్దరి మధ్య మనస్పర్థల విషయం తెరపైకి వచ్చింది. తాజాగా ప్రభాస్.. తనకు ఉన్న మనస్పర్థల గురించి వివరణ ఇచ్చింది పూజా హెగ్డే..

షూటింగ్ సమయంలో ప్రభాస్ తో తనకు మనస్పర్థలు వచ్చినట్టు వస్తున్న వార్తలలో నిజం లేదని.. మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉన్నామని.. ప్రభాస్ తనకోసం చాలాసార్లు స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ తీసుకువచ్చారని తెలిపింది. తను చాలా మంచి వ్యక్తి అంటూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది. దీంతో ప్రభాస్.. పూజా హెగ్డే మధ్య గొడవల విషయంలో క్లారిటీ ఇచ్చేసింది పూజా.

Also Read: Samantha: నయా బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సామ్‌.. నాగ చైతన్యకు పోటీగానే అంటోన్న నెటిజన్లు..

Priya Prakash Varrier: క్యూట్ క్యూట్‏గా కవ్విస్తున్న ప్రియా వారియర్..మలయాళీ భామ అందమైన లేటెస్ట్ ఫొటోస్.

Samyuktha Menon: భీమ్లానాయక్ బ్యూటీకి ఫిదా అయినా తెలుగు ప్రేక్షకులు.