Samantha: నయా బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సామ్‌.. నాగ చైతన్యకు పోటీగానే అంటోన్న నెటిజన్లు..

విడాకుల వ్యవహారం తన జీవితంపై ప్రతికూల ప్రభావం చూపకుండా జాగ్రత్త పడుతోంది సమంత (Samantha). వరుసగా సినిమాలు చేస్తూ తనను తాను బిజీగా ఉంచుకుంటూ వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తోంది.

Samantha: నయా బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సామ్‌.. నాగ చైతన్యకు పోటీగానే అంటోన్న నెటిజన్లు..
Samantha
Basha Shek

|

Mar 09, 2022 | 1:49 PM

విడాకుల వ్యవహారం తన జీవితంపై ప్రతికూల ప్రభావం చూపకుండా జాగ్రత్త పడుతోంది సమంత (Samantha). వరుసగా సినిమాలు చేస్తూ తనను తాను బిజీగా ఉంచుకుంటూ వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే వ్యాపార రంగంలోనూ సమంతకు మంచి నైపుణ్యం ఉంది. ఇప్పటికే సాఖి అనే క్లాత్‌ బ్రాండ్‌ స్టోర్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేస్తోన్న సామ్‌ ఎడ్యుకేషన్‌, రెస్టారెంట్‌ బిజినెస్‌లలో కూడా రాణిస్తోంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టిందీ అందాల తార. ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌ తరహాలో సస్టైన్ కార్ట్ అనే ఈ- కామర్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టింది. కాగా దీనిని సామ్ స్నేహితురాలు శిల్పా రెడ్డి నిర్వహిస్తోంది. ఇందులో అన్ని రకాల ఉత్పత్తులను సహజమైన పద్ధతుల్లో తయారుచేస్తారు. అనంతరం వాటిని దేశ వ్యాప్తంగా డెలివరీ చేస్తుంటారు.

కాగా సస్టైన్‌ కార్ట్‌ లో ఇన్వెస్ట్‌ చేసిన సమంత దానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ‘సస్టైన్ కార్ట్‌లో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. దేశంలో నేచర్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్‌లపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి సంస్థలో ఇన్వెస్టర్‌గా చేరినందుకు ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చింది సామ్‌. కాగా ఇటీవల ఇటీవల నాగ చైతన్య కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో నూతనంగా ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించి విస్తృతంగా ప్రమోషన్‌ చేస్తున్నాడు. ఈక్రమంలో చైతూకు పోటీగానే సామ్‌ ఈ కొత్త బిజినెస్‌ స్టార్ట్‌ చేసిందని ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది సామ్. అదేవిధంగా విజయ్‌ సేతుపతి, నయనతారతో కలిసి నటించిన ‘కాతువాకుల రెండు కాదల్‌’ రిలీజ్‌కు రెడీగా ఉంది. వీటితో పాటు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. ఇక నాగచైతన్య త్వరలోనే థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Also Read:Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Hindu Tradition: పూర్వం గడపకు పసుపు, కుంకుమతో పూజ చేసి.. రోజులో పనిని మొదలు పెట్టేవారు ఎందుకంటే..

ప్రయాణిస్తున్న కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం.. షాక్ లో ప్రయాణికులు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu