ప్రయాణిస్తున్న కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం.. షాక్ లో ప్రయాణికులు

విశాఖ జిల్లాలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. సంతోషంగా సాగిపోతున్న వారి ప్రయాణం విషాదంగా మారంది. అప్పటివరకు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తున్న వారు..ఊహించని ప్రమాదానికి(Accident) గురయ్యారు. ఈ ఘటన వారిని..

ప్రయాణిస్తున్న కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం.. షాక్ లో ప్రయాణికులు
Car Fire In Vizag
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 09, 2022 | 1:15 PM

విశాఖ జిల్లాలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. సంతోషంగా సాగిపోతున్న వారి ప్రయాణం విషాదంగా మారంది. అప్పటివరకు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తున్న వారు..ఊహించని ప్రమాదానికి(Accident) గురయ్యారు. ఈ ఘటన వారిని హతాశుల్ని చేసింది. విశాఖపట్నం(Visakhapatnam) నుంచి రాజమండ్రి వైపు కారులో ఓ కుటుంబం ప్రయాణిస్తోంది. నక్కపల్లి మండలం ఉద్దండపురం హైవేకు వచ్ఛేసరికి కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా ఉన్న మరో కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న ఇండికా కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వెనుక ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు(Fire in Car) చెలరేగాయి. ఆ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు.

కారు ప్రమాదానికి గురైన వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. లోపల ఉన్నవారిని హెచ్చరించడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. వారు దిగగానే కారులో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాడయి. క్షణాల్లోనే కారు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read

18 బంతుల్లో 9 పరుగులు చేయలేకపోయిన ఇంగ్లాడ్.. వెస్టిండీస్ చేతిలో ఘోర ఓటమి..

Arjuna Fruit: అర్జునపండులో అదిరే ఔషధ గుణాలు.. నోటి దుర్వాసనకి చక్కటి పరిష్కారం..

Facts about Tears: బాధ కలిగినపుడు కన్నీరు కాటుక కళ్లను దాటనివ్వండి! సైన్స్‌ ఏం చెబుతోందంటే..