AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facts about Tears: బాధ కలిగినపుడు కన్నీరు కాటుక కళ్లను దాటనివ్వండి! సైన్స్‌ ఏం చెబుతోందంటే..

అశ్రునయనాలు.. గుండెల్లో బాధ కన్నీరు రూపంలో బయటికి వచ్చేటప్పుడు కనిపించే దృశ్యం. ప్రతి ఒక్కరు వారివారి జీవన ప్రయణంలో ఖచ్చితంగా ఏడ్చినవారే. ఈ విషయంలో మగవారికంటే..

Facts about Tears: బాధ కలిగినపుడు కన్నీరు కాటుక కళ్లను దాటనివ్వండి! సైన్స్‌ ఏం చెబుతోందంటే..
Crying
Srilakshmi C
|

Updated on: Mar 09, 2022 | 11:51 AM

Share

Crying- Health Benefits of Tears: అశ్రునయనాలు.. గుండెల్లో బాధ కన్నీరు రూపంలో బయటికి వచ్చేటప్పుడు కనిపించే దృశ్యం. ప్రతి ఒక్కరు వారివారి జీవన ప్రయణంలో ఖచ్చితంగా ఏడ్చినవారే. ఈ విషయంలో మగవారికంటే ఆడవారు ఎక్కువగా నిష్ణాతులు. ఐతే ఏడ్వడం కూడా ఆరోగ్యానికి మేలేననిసైన్స్ చెబుతోంది. ఎప్పుడైనా గమనించారా భావోద్వేగాలకు గురైనప్పుడు ఏడ్చినప్రతిసారీ (Crying) కళ్లలోంచి కన్నీళ్లు వస్తుంది. ఐతే ఎటువంటి నొప్పి, బాధ అనిపించదు! అంతేకాకుండా కొందరు బలహీనతకు చిహ్నంగా ఏడుపును భావిస్తారు. ఐతే దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సైన్స్‌ చెబుతోంది. ఇది పరిశోధనలో కూడా నిర్ధారణ అయ్యింది. ఉదాహరణకు.. ఏడ్చిన తర్వాత చాలా రిలాక్స్‌గా అనిపించడం మనందరికీ చాలా సార్లు అనుభవమే. ఒత్తిడి స్థాయి కూడా తగ్గుతుంది. అలా ఎందుకు ఉంటుందో.. ఏడ్వడం వల్ల వనకూరే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) ఏమితో తెలుసుకుందాం..

నిజానికి కన్నీళ్లు మూడు రకాలుగా వస్తాయట. మొదటి రకం కన్నీరు.. కళ్లలో తేమను కాపాడడానికి ఎల్లప్పుడు వస్తాయి. రెండవది- గాలి, దుమ్ము, పొగ కళ్లలోకి చేరినప్పుడు వచ్చేవి. ఇక మూడవ రకం ఒక వ్యక్తి భావోద్వేగానికి లోనైనప్పుడు వచ్చేవి. ఉదాహరణకు.. విచారంగా ఉండటం, బాధపడటం మొదలైనవి. బాధ కలిగిన ప్రతీసారీ ఏడ్వడం అన్ని సందర్భాల్లో కుదరదు. అలాంటప్పుడు నయనాలు దాటి అశ్రువులు బయటకురాకుండా విశ్వప్రయత్నాలు చేస్తాం! అంటే కన్నీళ్లు వచ్చినప్పుడు దానిని ఆపడానికి ప్రయత్నిస్తాం.. దీని వల్ల స్ట్రెస్‌ లెవల్స్‌ మరింతగా పెరుగుతాయట. ఒక అధ్యయనం ప్రకారం.. ఒక వ్యక్తి ఏడ్చినప్పుడు ఎటువంటి కెమికల్‌ రియాక్షన్‌ జరుగుందనే విషయంపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ముందుగా ఏడ్వడం వల్ల ఆ వ్యక్తి బాధను మరచిపోయి మంచి అనుభూతిని పొందడం జరుగుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. మంచి నిద్ర వస్తుంది. కళ్లకు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. 2011లో చేసిన ఓ పరిశోధన ప్రకారం.. కన్నీళ్లలో ఒక ప్రత్యేకమైన రసాయన లైసోజోమ్ కనుగొనబడింది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఉంటుందట. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో ఇది సహాయపడుతుంది. కాబట్టి కన్నీళ్లు వచ్చినప్పుడు వాటిని స్వేచ్ఛగా కారనివ్వడం మంచిది. ఇలా చేయడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

Also Read:

ICAR-CMFRI Jobs: పదో తరగతి అర్హతతో.. ఐకార్‌-సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..