Knowledge: ఆ దేశ కరెన్సీ డాలర్‌ కంటే చాలా ఎక్కువ.. ఎందుకో తెలుసా..?

Knowledge: అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఆధిపత్యం చెలాయిస్తుంది. అనేక లావాదేవీలు డాలర్ ఆధారంగానే జరుగుతాయి. కానీ ప్రపంచంలోని చాలా దేశాల కరెన్సీ విలువ డాలర్

Knowledge: ఆ దేశ కరెన్సీ డాలర్‌ కంటే చాలా ఎక్కువ.. ఎందుకో తెలుసా..?
Kuwait
Follow us
uppula Raju

|

Updated on: Mar 09, 2022 | 11:26 AM

Knowledge: అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఆధిపత్యం చెలాయిస్తుంది. అనేక లావాదేవీలు డాలర్ ఆధారంగానే జరుగుతాయి. కానీ ప్రపంచంలోని చాలా దేశాల కరెన్సీ విలువ డాలర్ కంటే చాలా ఎక్కువ. ఆ కరెన్సీలతో భారతదేశ కరెన్సీని పోల్చితే మనం చాలా వెనుకబడి ఉంటాం. ఈ రోజు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కరెన్సీ గురించి తెలుసుకుందాం. ఇండియాలో ఈ కరెన్సీని మారిస్తే తక్కువ డబ్బులతో ధనవంతులుగా మారవచ్చు. కువైట్‌ కరెన్సీ ప్రపంచంలోని బలమైన కరెన్సీగా గుర్తింపు సాధించింది. కువైట్‌ కరెన్సీని దినార్‌ రూపంలో పిలుస్తారు. ఒక కువైట్ దినార్ విలువ భారతదేశంలో 253 రూపాయలకు సమానం. కువైట్ కరెన్సీ శక్తివంతంగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాస్తవానికి కువైట్‌లో చమురు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. 1960లో కువైట్‌ బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత దినార్‌ ప్రారంభించారు. ఆ సమయంలో ఒక దినార్‌ ఒక పౌండ్‌కు సమానం. కువైట్ ఒక చిన్న దేశం. ఇది భౌగోళికంగా ఇరాక్, సౌదీ అరేబియా మధ్య ఉంటుంది.

కువైట్ స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కూడా కరెన్సీ అధిక విలువకు ఒక కారణం. అలాగే ఇది చమురు సంపన్న దేశం. ప్రపంచ చమురు నిల్వల్లో 9% ఈ దేశంలోనే ఉన్నాయని చెబుతారు. కువైట్ చమురు ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దేశ ఆదాయంలో 95% చమురు అమ్మకాలపైనే వస్తుంది. తలసరి GDP అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో కువైట్ ఎనిమిదో స్థానంలో ఉంది. గణనీయమైన చమురు ఉత్పత్తి కువైట్ సంపదను పెంచడంలో సాయపడింది. కువైట్ దినార్ విలువను పెంచడంలో దోహదం చేసింది. కరెన్సీ విలువ ఎక్కువగా ఉండటానికి ఇది ఒక ముఖ్య కారణం. అయితే ఒకప్పడు కువైట్‌ ఇండియా కరెన్సీనే వాడేది.1959 వరకూ భారతీయ రూపాయినే కువైట్‌ కరెన్సీగా చలామణి అయ్యేది. కానీ 1960లొ తొలిసారి రూపాయి స్థానంలో గల్ఫ్‌ రూపీని ప్రవేశ పెట్టింది. తరువాత కాలక్రమేణా ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా రూపాంతరం చెందింది.

బిగుతైన ప్యాంట్‌, షర్ట్స్‌ ధరిస్తున్నారా.. మానుకోండి లేదంటే ఆ సమస్య ఏర్పడవచ్చు..!

Viral Video: భలే గమ్మత్తు.. కుక్క, గొర్రెల ఫన్నీ వీడియో.. నెట్టింట్లో వైరల్‌..

Women: మగవారి ఈ అలవాట్లు స్త్రీలకు అస్సలు నచ్చవు.. కారణం ఏంటంటే..?