Russia-India Friendship: ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం.. అందుకే రష్యాతో భారత్‌కు విడదీయరాని బంధం

Russia-India: రష్యా, ఉక్రెయిన్( Ukraine) ల మధ్య జరుగుతున్న పోరులో భారతదేశం ఎవరికీ తన మద్దతు తెలపకుండా తటస్థంగా ఉంది. ఎందుకంటే భారత్, రష్యాల మధ్య స్నేహం ఇప్పటిది కాదు.. కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతుంది..

Russia-India Friendship: ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం.. అందుకే రష్యాతో భారత్‌కు విడదీయరాని బంధం
Russia Helped India During
Follow us
Surya Kala

|

Updated on: Mar 09, 2022 | 11:30 AM

Russia-India Friendship: రష్యా, ఉక్రెయిన్( Ukraine) ల మధ్య జరుగుతున్న పోరులో భారతదేశం ఎవరికీ తన మద్దతు తెలపకుండా తటస్థంగా ఉంది. ఎందుకంటే భారత్, రష్యాల మధ్య స్నేహం ఇప్పటిది కాదు.. కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతుంది. 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధ(Indo Pak war) స‌మ‌యంలో మనదేశానికి వ్యతిరేకంగా.. పాక్ కు మద్దతుగా అమెరికా (America) సహా అనేక దేశాలు నిలిచాయి. ఒంటరిగా ఉన్న మనదేశానికి అన్ని విధలా అండగా నిలిచింది రష్యా మాత్రమే.. భారత్ కు అడుగడుగా అండగా నిలవడంతో ఆనాటి ఇండో పాక్ ల మధ్య జరిగిన యుద్ధంలో భారత్ పాకిస్థాన్ ను ఓడించింది.

200 ఏళ్ల బ్రిటీష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర పొంది కేవలం 24 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. మరోవైపు, 1971లో  తూర్పు పాకిస్తాన్ ఆధిపత్య కోసం దూకుడు ప్రదర్శిస్తే.. పశ్చిమ పాకిస్తాన్ దేశం తన స్వేచ్ఛ కోసం ప్రయత్నిస్తోంది.  అప్పటి పాక్ ప్రధాని  ఖాన్ ఆదేశాల మేరకు పాకిస్తాన్ సైన్యం మార్చి 25, 1971 రాత్రి తూర్పు పాకిస్తాన్ ప్రజలపై ఆపరేషన్ సెర్చ్‌లైట్‌ని ప్రారంభించింది. దీంతో 1971 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం డిసెంబర్ 3న ప్రారంభమైంది. అప్పడు యుద్ధ సమయంలో భారత్ కు అడుగడుగునా అండగా నిలిచింది. దీంతో ఆ యుద్ధం 1971 డిసెంబర్ 16న జరిగిన పాకిస్థాన్‌ను భారత్ ఓడించింది. ఈ యుద్ధంలో కేవలం 13 రోజుల్లోనే 93 వేల మంది పాకిస్థాన్ సైనికులు భారత సైన్యం ముందు మోకరిల్లారు.

ఈ యుద్ధంలో అమెరికా పాకిస్థాన్ పక్షాన నిలవడమే కాదు.. పాక్ కు యుద్ధానికి అన్నివిధాలుగా సాయం చేయడానికి ప్రయత్నం చేసింది. ముఖ్యంగా జపాన్‌కు సమీపంలో ఉన్న తన నౌకాదళానికి చెందిన ఏడవ నౌకాదళాన్ని పాకిస్తాన్‌కు సహాయం చేయడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ పంపే ప్రయ‌త్నం చేశాడు. యుఎస్ నావికాదళంలోని ఏడవ నౌకాదళం పాకిస్తాన్‌కు అనుకూలంగా భారతదేశం వైపు కదులుతున్నప్పుడు.. భారతదేశ ప్రధాని రష్యా సహాయం కోరింది. అప్పటికి భారత్ కు రష్యాకు మంచి స్నేహ సంబంధాలు లేవు.. అయినప్పటికీ భారత్ అడిగిన సాయాన్ని రష్యా కాదనలేదు. యాదృచ్ఛికంగా, యుద్ధం ప్రారంభానికి కొన్ని నెలల ముందు, సోవియట్-భారత్ శాంతి, స్నేహం, సహకార ఒప్పందంపై రెండు దేశాలు సంత‌కాలు చేశాయి.

భారత నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ధ్వంసం చేయాలనే ఉద్దేశ్యంతో వ‌చ్చిన‌ పాకిస్థాన్ నేవీ ఫ్లీట్‌లో అమెరికా నిర్మించిన పీఎన్‌ఎస్ ఘాజీని విశాఖపట్నం సమీపంలో భారత నౌకాదళం ముంచింది. అమెరికా నావికాదళం బంగాళాఖాతం వైపు కదులుతున్నట్లు చూసిన రష్యా, భారత్‌కు సహాయం చేసేందుకు తన అణు సామర్థ్యం గల జలాంతర్గాములను, డిస్ట్రాయర్లను పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి పంపింది.

అమెరికాకు చెందిన ఏడవ నౌకాదళం  75,000-టన్నుల అణుశక్తితో నడిచే విమాన వాహక నౌక… USS ఎంటర్‌ప్రైజ్ నాయకత్వం వహించింది. ఇది 70 కంటే ఎక్కువ యుద్ధ విమానాలు, బాంబర్‌లను మోసుకెళ్లిన ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌక. ఈ నౌక బంగాళాఖాతం చేరుకునే సమయానికి అంటే..  16 డిసెంబర్ 1971న పాకిస్తాన్ సైన్యం భారతదేశం ముందు లొంగిపోయింది. యుద్ధం ముగిసిన అనంతరం రష్యా నౌక వెనక్కి వెళ్ళలేదు.. మళ్ళీ అమెరికా నౌక తిరిగి వస్తుందేమోనని.. రష్యన్ నేవీ సెవెంత్ ఫ్లీట్‌ను కొన్ని రోజుల పాటు హిందూ సముద్రంలోనే నడిపింది.

ఈ యుద్ధ సమయంలో… పాకిస్థాన్‌ కు అమెరికా మాత్రమే కాదు, ఇతర దేశాలు మద్దతుగా నిలిచాయి. అప్పుడు అమెరికా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాల్పుల విరమణ తీర్మానం తీసుకొచ్చి పాకిస్థాన్ పక్షాన నిలబడేందుకు ప్రయత్నించింది. అమెరికా ప్రతిపాదనపై..ర‌ష్యా … తన వీటో అధికారాన్ని ఉపయోగించి..  భారతదేశానికి సహాయం చేసింది. అమెరికా ఎత్తుగడలకు అడ్డుకట్ట వేస్తూ.. భారతదేశానికి.. రష్యా అన్నివిధాలా అండగా నిలిచి ఎంతో సహాయపడింది.

Also Read:

రష్యాపై ఉరిమిపాడుతున్న యూరప్ దేశాలు… కానీ ఎం మాత్రం తగ్గని రష్యా..(వీడియో)

అష్ట దిగ్భంధనంలో రష్యా.. ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న తొలిదేశం!