AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nari Shakti Award: కశ్మీరీ వనితకు నారీశక్తి అవార్డు ప్రదానం చేసిన రాష్ట్రపతి కోవింద్‌.. ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలు ఆమె..

Nari Shakti Award: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కశ్మీర్ కు చెందిన నసీరా అక్తర్(Nasira Akhter) అనే మహిళకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నారీశక్తి పురస్కారాన్ని దిల్లీలో అందజేశారు.

Nari Shakti Award: కశ్మీరీ వనితకు నారీశక్తి అవార్డు ప్రదానం చేసిన రాష్ట్రపతి కోవింద్‌.. ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలు ఆమె..
Nari Shakti Puraskar
Ayyappa Mamidi
|

Updated on: Mar 09, 2022 | 11:14 AM

Share

Nari Shakti Award: అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2022 సందర్భంగా కశ్మీర్ కు చెందిన నసీరా అక్తర్(Nasira Akhter) అనే మహిళకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నారీశక్తి పురస్కారాన్ని దిల్లీలో అందజేశారు. కశ్మీర్ లోని కానీపూరా కుల్ గామ్ కు చెందిన నసీరా అక్తర్ పాలిథిన్ ను బూడిదగా మార్చే హెర్బ్ ను కనుగొన్నందుకు గాను ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పాలిథిన్ ను బూడిదగా మార్చే ప్రక్రియను కనుగొన్న మెుదటి భారతీయురాలుగా ఆమె నిలిచారు. ఆమె పట్టుదలను రాష్ట్రపతి కోవింద్ ప్రశంశించారు. 1972లో జన్మించిన నసీరా అక్తర్ ఎన్నో ప్రయత్నాల తరువాత దీనిని కనుగొన్నారు. ఆమె చేసిన కృషికి ఇప్పుడు దేశ వ్యాప్తంగా అనేక మంది అభినందనలు తెలుపుతున్నారు. తన ఆవిష్కరణతో నసీరా ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, కశ్మీర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నిలిచారు.

కేవలం 10వ తరగతి వరకు చదువుకున్న ఆమె తన ఆలోచనలకు కార్యరూపం తీసుకువచ్చే క్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. తనకు అందుబాటులో ఉన్న పరిమిత వనరులను వినియోగించుకుంటూ.. ఎటువంటి ల్యాబొరేటరీ సౌకర్యాలు లేనప్పటికీ దేవుని దయతో తాను ముందుకు వెళ్లి ఈ విజయాన్ని సాధించగలిగానని పేర్కొన్నారు. ఏదైనా ఆవిష్కరించాలనే ఆలోతనల కోసం పుస్తకాలు చదవవలసిన అవసరం లేదని.. యూనివర్స్ ఒక తెరిచిన పుస్తకమని ఆమె అభిప్రాయపడ్డారు. కనిపెట్టడం కన్నా దానిని మార్కెట్లోకి తీసుకెళ్లటం చాలా పెద్ద సవాలు అని ఆమె అంటున్నారు. ప్రస్తుతం ఆమె కాలుష్య నియంత్రణ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పరిశోధనా క్రమంలో తనకు చాలా మంది సరోర్ట్ గా నిలిచారని ఆమె తెలిపారు.

ఇవీ చదవండి..

Viral Photo: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులను గుర్తుపట్టారా..? ఇండియాలోనే వారిప్పుడు టాప్ వ్యాపారవేత్తలు..

IPO Alert: మార్కెట్లోకి మరో కొత్త ఐపీఓ.. రూ. 600 కోట్లు అందుకోసమేనా..?