Viral Photo: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులను గుర్తుపట్టారా..? ఇండియాలోనే వారిప్పుడు టాప్ వ్యాపారవేత్తలు..

Viral Photo: పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా(Harsh Goenka) సోమవారం తన ట్విట్టర్ ఫాలోవర్లను గెస్సింగ్ గేమ్‌ తో సవాలు చేశారు. RPG గ్రూప్ ఛైర్మన్ ఇద్దరు సోదరుల అలనాటి ఫోటోను పంచుకున్నారు.

Viral Photo: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులను గుర్తుపట్టారా..? ఇండియాలోనే వారిప్పుడు టాప్ వ్యాపారవేత్తలు..
Ambani Brothers
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 09, 2022 | 10:32 AM

Viral Photo: పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా(Harsh Goenka) సోమవారం తన ట్విట్టర్ ఫాలోవర్లను గెస్సింగ్ గేమ్‌ తో సవాలు చేశారు. RPG గ్రూప్ ఛైర్మన్ ఇద్దరు సోదరుల అలనాటి ఫోటోను పంచుకున్నారు. ఫాలోవర్స్ గుర్తుపట్టటానికి వీలుగా “M&A” అనే చిన్న హింట్ ఇచ్చారు. “ఇద్దరు సోదరులు వారి తొలిరోజుల్లో.. M&A” అంటూ మిస్టర్ గోయెంకా ఓ బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని షేర్ చేస్తూ రాశారు. ఫోటోలో ఇద్దరు యువకులు, వారి మెడలో దండలతో ఫార్మల్ సూట్‌లు ధరించి ఉన్నారు. వారు ప్రస్తుతం మనందరికీ సుపరిచితులైన వ్యాపారవేత్తలే. మీరు కూడా వారిని గుర్తుపట్టేయండి.

ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఉన్నది రిలయన్స్ సంస్థ స్థాపకుడు ధీరూభాయ్ అంబానీ కుమారులు. ఫోటోలో వెనుక కనిపిస్తున్నది ముకేశ్ అంబానీ కాగా.. మరో పిల్లవాడు అతని సోదరుడు అనిల్ అంబానీ. ప్రస్తుతం అనిల్ తన ఆస్తిని కోల్పోయారు. ముకేశ్ ఆయిల్ నుంచి రిటైల్ వ్యాపారం వరకు అన్ని రకాల వ్యాపారాల్లో అగ్రగామిగా ఉన్నారు. ఆసియాలోని బిలియనీర్ల జాబితాలో తన పేరును పధిలంగా ఉంచుకున్నారు. తండ్రి ధీరూభాయ్ అంబానీ మృతి తరువాత తల్లి కోకిలా బెన్ సమక్షంలో వ్యాపారాలను పంచుకున్నారు సోదురులిద్దరూ. ప్రస్తుతం ముకేశ్ అంబానీ కుమారులు, కుమార్తె వివిధ రిలయన్స్ కు చెందిన కొత్తతరం కంపెనీలను విజయవంతంగా నడుపుతున్నారు.

ఇవీ చదవండి..

Indian Markets: భయాల నుంచి బయటపడుతున్న మార్కెట్లు.. ఫోకస్ లో ఉన్న ఆ కంపెనీల షేర్లు..

IPO Alert: మార్కెట్లోకి మరో కొత్త ఐపీఓ.. రూ. 600 కోట్లు అందుకోసమేనా..?