Russia Ukraine Crisis: అష్ట దిగ్భంధనంలో రష్యా.. ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న తొలిదేశం!

రష్యాపై ప్రపంచ దేశాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా తొలి స్థానంలో నిలిచింది.

Russia Ukraine Crisis: అష్ట దిగ్భంధనంలో రష్యా.. ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న తొలిదేశం!
World Most Sanctions On Russia
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 09, 2022 | 8:15 AM

Russia Ukraine Crisis: రష్యాపై ప్రపంచ దేశాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలు(World Most Sanctions) ఎదుర్కొంటున్న దేశంగా రష్యా తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌(Iran), ఉత్తరకొరియా(North Korea) వంటి దేశాల కంటే రష్యాపైనే ఎక్కువ ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్‌ తన కథనంలో వెల్లడించింది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే అనేక దేశాలు రష్యాపై 2,700లకు పైగా ఆంక్షలు విధించాయి. Castellum.ai అనే ప్రపంచ ఆంక్షల ట్రాకింగ్ డేటాబేస్‌ తాజాగా దేశాలపై ఉన్న ఆంక్షల జాబితాకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఇరాన్‌, సిరియా, ఉత్తరకొరియా వంటి దేశాలను దాటి అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా తొలి స్థానంలో ఉంది. ప్రస్తుతం రష్యాపై 5530 ఆంక్షలుండగా.. ఇందులో సగానికి పైగా కేవలం గత 10 రోజుల్లో విధించనవే. ఈ ఏడాది ఫిబ్రవరి 22 నాటికి రష్యాపై 2,774 ఆంక్షలు అమల్లో ఉండగా.. ఆ తర్వాత నుంచి మరో 2,778 ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. దీంతో రష్యాను అడ్డుకునేందుకు అమెరికా సహా పలు ప్రపంచ దేశాలు కొన్ని రోజులుగా వేల కొద్దీ ఆంక్షలు విధించాయి. ఇందులో అత్యధికంగా స్విట్జర్లాండ్‌ దేశం రష్యాపై 568 ఆంక్షలు విధించింది. ఆ తర్వాత ఐరోపా సమాఖ్య 518, ఫ్రాన్స్‌ 512, అమెరికా 243 ఆంక్షలు విధించినట్లు బ్లూమ్‌బర్గ్‌ కథనం వెల్లడించింది. ఇక రష్యా తర్వాత అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న రెండో దేశంగా ఇరాన్‌ ఉంది. ఈ దేశంపై ప్రస్తుతం 3,616 ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ తర్వాత సిరియాపై 2,608, ఉత్తరకొరియాపై 2,077 ఆంక్షలు ఉన్నట్లు నివేదిక తెలిపింది.

Read Also…. Russia Ukraine War Live: రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు.. యూరోపియన్, నాటో దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?