AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భలే గమ్మత్తు.. కుక్క, గొర్రెల ఫన్నీ వీడియో.. నెట్టింట్లో వైరల్‌..

Viral Video: ఈ భూమిపై కుక్క కంటే నమ్మకమైన జంతువు మరొకటి లేదు. ఒక్కోసారి మనుషులు కూడా విశ్వాసం కోల్పోవచ్చు కానీ కుక్కలు యజమాని పట్ల తమ విధేయతను అస్సలు తగ్గించవు.

Viral Video: భలే గమ్మత్తు.. కుక్క, గొర్రెల ఫన్నీ వీడియో.. నెట్టింట్లో వైరల్‌..
Sheep Trouble
uppula Raju
|

Updated on: Mar 09, 2022 | 11:08 AM

Share

Viral Video: ఈ భూమిపై కుక్క కంటే నమ్మకమైన జంతువు మరొకటి లేదు. ఒక్కోసారి మనుషులు కూడా విశ్వాసం కోల్పోవచ్చు కానీ కుక్కలు యజమాని పట్ల తమ విధేయతను అస్సలు తగ్గించవు. అందుకే వీటిని ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన జంతువులుగా పిలుస్తారు. అవసరమైతే యజమాని కోసం ప్రాణాలనైనా అర్పి్స్తుంది. ఆపద సమయంలో అవసరమైతే సింహంతో కూడా పోరాడుతుంది. అంతేకాదు కొన్నిసార్లు కుక్కలు ఆపదలో ఉన్నవారిని చూసి కూడా జాలిపడుతాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో కుక్క చెట్టుకొమ్మల మధ్య చిక్కుకున్న గొర్రెని భలే గమ్మత్తుగా కాపాడుతుంది. ఈ వీడియోలో ఒక గొర్రె అనుకోకుండా ఒక చెట్టు కొమ్మల మధ్య ఇరుక్కుంటుంది. ముందుకు వెనుకకు రాకుండా అటు ఇటు కదులుతుంటుంది. అప్పుడు గొర్రె పరిస్థితిని గమనించిన కుక్కు దానిని కాపాడాలనుకుంటుంది. వెంటనే దానిని వెనుక నుంచి ముందుకు నెట్టివేస్తుంది. కానీ కొమ్మల మధ్య నుంచి బయటికి రాలేకపోతుంది. దీంతో మరోవైపునకు వచ్చి ఫన్నీగా గొర్రెకి చక్కిలగింతలని చేస్తుంది. దీంతో గొర్రె ఒక్కసారిగా జంప్‌ చేసి కొమ్మల మధ్య నుంచి బయటికి వస్తుంది. అక్కడి నుంచి వెంటనే పారిపోతుంది. కుక్కు చేసిన ఈ పనికి వీడియో చూసిన అందరు నవ్వుతున్నారు.

ఈ ఫన్నీ వీడియో Instagramలో షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 4.2 మిలియన్లు అంటే 42 లక్షల వీక్షణలను సంపాదించింది. అయితే 58 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. చాలామంది వీడియో చూసిన తర్వాత వివిధ రియాక్షన్‌లు ఇచ్చారు. గొర్రెని రక్షించినందుకు కుక్కను ప్రశంసించారు. అలాగే దానిని కాపాడిన విధానాన్ని చూసి నవ్వుకున్నారు. మీరు కూడా వీడియో చూస్తే మీ స్పందనని తెలియజేయండి.

బిగుతైన ప్యాంట్‌, షర్ట్స్‌ ధరిస్తున్నారా.. మానుకోండి లేదంటే ఆ సమస్య ఏర్పడవచ్చు..!

Women: మగవారి ఈ అలవాట్లు స్త్రీలకు అస్సలు నచ్చవు.. కారణం ఏంటంటే..?

Cricketers: పెళ్లికాకముందే ఈ ఐదుగురు స్టార్‌ క్రికెటర్లు తండ్రులయ్యారు..!