Women: మగవారి ఈ అలవాట్లు స్త్రీలకు అస్సలు నచ్చవు.. కారణం ఏంటంటే..?

Women: మహిళలను ఆకట్టుకోవడం అంత సులువు కాదు. కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే స్త్రీలు.. పురుషులలో ఉండే అవలక్షణాలను ఇష్టపడరు. దీని కారణంగా

Women: మగవారి ఈ అలవాట్లు స్త్రీలకు అస్సలు నచ్చవు.. కారణం ఏంటంటే..?
Relationship
Follow us
uppula Raju

|

Updated on: Mar 09, 2022 | 8:28 AM

Women: మహిళలను ఆకట్టుకోవడం అంత సులువు కాదు. కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే స్త్రీలు.. పురుషులలో ఉండే అవలక్షణాలను ఇష్టపడరు. దీని కారణంగా వారి సంబంధం ఎక్కువ కాలం కొనసాగదు. అందుకే ప్రస్తుత కాలంలో చాలా జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. చిన్న చిన్న గొడవలు పెద్దగా మారి జీవితాలు నాశనమవుతున్నాయి. అయితే ఒకరికొకరు అర్థం చేసుకొని జీవిస్తే ఇలాంటి సమస్యలు ఉండవు. సాధారణంగా స్త్రీలు.. పురుషులలో ఉండే ఈ చెడు అలవాట్లని అస్సలు సహించలేరు. వాటి గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిది భార్యాభర్తల మధ్య సంబంధం. ఎప్పుడు స్త్రీని ఒక యంత్రంగా చూడకూడదు. చాలామంది పురుషులు స్త్రీలని ఒక పనియంత్రాలుగా భావిస్తారు. ఇది మంచి పద్దతి కాదు. దీని కారణంగా మహిళలు ఆ సంబంధాన్ని దూరం చేసుకోవాలనుకుంటారు. భాగస్వామితో విడిపోవాలని నిర్ణయించుకుంటారు.

బాధ్యత మొత్తం ఆమెపైనే

రెండో విషయం ఏంటంటే.. ఇంటి బాధ్యత మొత్తం మహిళపై పెట్టడం భావ్యం కాదు. ఈ విషయం వల్ల చాలా సంబంధాలు చెడిపోతాయి. ఇంటి బాధ్యత మొత్తం స్త్రీపై ఉంటే ఆమె చాలా ఒత్తిడికి గురవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలకి గురవుతుంది. ఈ కారణంగా ఆమె ఒంటరిగా బతకడానికి నిర్ణయించుకుంటుంది.

ఇంటికి ఆలస్యంగా రావడం

నేటి కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో చాలా మంది పురుషులు ఆలస్యంగా ఇంటికి వస్తారు. మహిళలు ఒకటి లేదా రెండుసార్లు పట్టించుకోరు. కానీ ప్రతిరోజూ ఇలాగే జరిగితే సహించలేరు. భార్యాభర్తల సంబంధం దెబ్బతింటుంది. విడిపోవాలని అనుకుంటారు.

అజాగ్రత్త భర్తలు

మరోవైపు అజాగ్రత్త భర్తలని కూడా స్త్రీలు ఇష్టపడరు. చాలామంది పురుషులు సోమరితనం వల్ల ఏ పనిచేయరు. వారిని పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతారు. దీంతో కుటుంబం గడవడం కష్టమవుతుంది. కొన్ని రోజులు భరించిన స్త్రీలు తర్వాత విడిపోవాలని అనుకుంటారు.

వంటగది కోపాలు

మహిళలు వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటారు. కానీ పురుషులు అక్కడక్కడ ఏదైనా చేస్తే వారికి వెంటనే కోపం వస్తుంది. వంటగది అస్తవ్యస్తంగా ఉండటాన్న స్త్రీలు అస్సలు ఇష్టపడరు. అందుకే పురుషులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. లేదంటే గొడవలు మొదలవుతాయి.

Zodiac Signs: మార్చిలో ఈ 4 రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులు.. కనకవర్షం కురుస్తుంది..!

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయి చెల్లించండి.. స్కూటీని ఇంటికి తీసుకెళ్లండి..!

Cricketers: పెళ్లికాకముందే ఈ ఐదుగురు స్టార్‌ క్రికెటర్లు తండ్రులయ్యారు..!