Beauty Tips: అందమైన పెదాల కోసం అదిరే చిట్కాలు.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేయండి..!

Beautiy Tips: కొంతమందికి తరచూ పెదవులు పొడిబారుతుంటాయి. దీంతో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పెదవులపై ఉండే డెడ్‌ స్కిన్‌ని తొలగించి

Beauty Tips: అందమైన పెదాల కోసం అదిరే చిట్కాలు.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేయండి..!
Lips
Follow us
uppula Raju

|

Updated on: Mar 11, 2022 | 11:41 AM

Beautiy Tips: కొంతమందికి తరచూ పెదవులు పొడిబారుతుంటాయి. దీంతో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పెదవులపై ఉండే డెడ్‌ స్కిన్‌ని తొలగించి కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే అవి మునుపటిలా మారుతాయి. అది ఎలాగో తెలుసుకుందాం. పొడి పెదవుల వెనుక డీహైడ్రేషన్ సమస్య కారణమై ఉంటుంది. అప్పుడు పుష్కలంగా నీరు తాగాలి. రోజుకు కనీసం 8 నుంచి 9 గ్లాసుల నీరు తాగడం వల్ల డెడ్ స్కిన్ సమస్య ఉండదు. డ్రై స్కిన్ సమస్యను దూరం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు పెదవులపై దేశీ నెయ్యి లేదా క్రీమ్ రాసుకోవాలి. ఈ పద్దతిని ప్రాచీనకాలం నుంచి వాడుతున్నారు. ఆయుర్వేద పండితులు కచ్చితంగా దీనినే సూచిస్తారు. ఇలా చేయడం వల్ల పెదాలు గులాబీ రంగులో కనిపించడమే కాకుండా డెడ్ స్కిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. మీరు కొబ్బరి నూనెతో మీ పెదాలను మసాజ్ చేస్తే పొడి చర్మం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. డెడ్ స్కిన్ సమస్యను తొలగించడంలో కొబ్బరి నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది.

అలోవెరా జెల్ వాడకంతో పెదవుల పొడి చర్మం సమస్యను అధిగమించవచ్చు. అలోవెరా జెల్‌ని మీ పెదవులపై క్రమం తప్పకుండా అప్లై చేయాలి. రోజుకు రెండు మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది. ఒక స్పూన్ బాదం నూనెలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి పెదవులపై రుద్దాలి. ఇలా చేయటం వల్ల పెదవులు మృదువుగా మారతాయి. ఆలివ్ నూనెలో కొద్దిగా పంచదార కలిపి పెదవులపై సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేయటం వల్ల పెదవులకు తేమ అందుతుంది. బాదం నూనె, కొబ్బరి నూనె సమానంగా తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేస్తే పెదవులు తేమను కోల్పోవు.

గుప్పెడు గులాబీ రేకులను పాలలో నానబెట్టి మెత్తగా నూరి పెదాలకు పట్టించాలి. ఇలా చేస్తే పెదాలు పగలకుండా మృదువుగా ఉంటాయి. వారానికి ఒకసారి టూత్ బ్రష్ తో పెదాలపైన మృదువుగా రుద్దితే అక్కడ మృత చర్మం తొలగిపోతుంది. టొమాటో గుండ్రని ముక్కని తీసుకుని దానిపై తేనె వేసి పెదవులపై 5 నిముషాలు రుద్దాలి. తర్వాత నీళ్లతో శుభ్రం చేస్తే పెదాలు తాజాగా మారతాయి. ఒకసారి వాడిన గ్రీన్ టీ బ్యాగ్ ని పడేయకుండా పెదవులపైన కొద్దిసేపు ఉంచాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పెదాలు తేమగా ఉంటాయి.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Arjun Fruit: అర్జునపండులో అదిరే ఔషధ గుణాలు.. నోటి దుర్వాసనకి చక్కటి పరిష్కారం..

Knowledge: ఆ దేశ కరెన్సీ డాలర్‌ కంటే చాలా ఎక్కువ.. ఎందుకో తెలుసా..?

Women: మగవారి ఈ అలవాట్లు స్త్రీలకు అస్సలు నచ్చవు.. కారణం ఏంటంటే..?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!