Drugs Smuggling: గత మూడేళ్లలో రూ.2,170 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్! ఈ దాయాది దేశం నుంచే సరఫరా..

భారత్‌లో పాక్‌ ద్వారా పెద్దఎత్తున డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ జరుగుతోంది. గత మూడేళ్లలో దాదాపు రూ.2,170 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌..

Drugs Smuggling: గత మూడేళ్లలో రూ.2,170 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్! ఈ దాయాది దేశం నుంచే సరఫరా..
Drugs Mafia
Follow us

|

Updated on: Mar 06, 2022 | 9:12 PM

Gujarat ATS seized drugs estimated to be worth 2,170 crore in the last three years and arrested 73 people: భారత్‌లో పాక్‌ ద్వారా పెద్దఎత్తున డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ జరుగుతోంది. గత మూడేళ్లలో దాదాపు రూ.2,170 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS) ఆదివారం (మార్చి 6) వెల్లడించింది. స్మగ్లింగ్‌కు పాల్పడిన 73 మంది పాకిస్తానీ పౌరులను అరెస్ట్ చేసినట్లు ఈ రోజు మీడియాకు వెల్లడించింది. గుజరాత్ తీర ప్రాంతంలో డ్రగ్స్ స్మగ్లింగ్‌కు అనేక సార్లు ప్రయత్నించారు. ఐతే ఆ ప్రయత్నాలన్నీ తిప్పికొట్టామని ఏటీఎస్‌ తెల్పింది. స్మంగ్లింగ్‌ను ఛేదించేందుకు గుజరాత్‌ ఏటీఎస్‌, ఇండియన్‌ కోస్ట్ గార్డ్‌, స్థానిక పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లు నిర్వహించినట్లు తెల్పింది. గుజరాత్ ఏటీఎస్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. గత ఏడాది (2021) దాదాపు రూ.1,466.18 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాదీనం చేసుకోగా, అంతకు ముందు రెండేళ్లలో రూ.704.04 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌ చేశారు. గుజరాత్‌ తీరం (Gujarat coastline)లోని అరేబియా సముద్రంలో పాక్‌ అంతర్జాతీయ సముద్ర సరిహద్దు ప్రాంతంలోనే ఇవన్నీ పట్టుబడ్డట్టు తెలిపారు.

ఐతే గతేడాది సెప్టెంబరులో కచ్ జిల్లాలోని ముంద్రా ఓడరేవులో రూ.21,000 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సీజ్‌ చేశారు. ఈ కేసును ప్రస్తుతం నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA) దర్యాప్తు చేస్తోంది. ఇది ప్రస్తుత లెక్కల్లో లేదు. 2019-2021 మధ్య, రాష్ట్ర ATS 427.3 కిలోల హెరాయిన్, 6.65 కిలోల MD (synthetic stimulant), 3.54 కిలోల బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నరు. 2019లో గుజరాత్‌ తీరప్రాంతానికి 178 నాటికల్‌ మైళ్ల దూరంలో జరిపిన ఆపరేషన్లో రూ.500 కోట్ల విలువైన 100 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తర్వాత 2020లో ఓ అనుమానాస్పద బోటులో రూ.175 కోట్ల విలువైన 35 కిలోల హెరాయిన్‌ను సీజ్‌ చేశారు. ఇక 2021లో పెద్ద మొత్తంలోనే మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. దాదాపు రూ.600 కోట్ల విలువైన 60 కిలోల హెరాయిన్‌ను సీజ్‌ చేసినట్టు ఏటీఎస్‌ తెల్పింది. ఈ విధంగా పలు మార్లు పెద్ద మొత్తంలో డ్రిగ్స్‌ పట్టుబడినట్టు పేర్కొంది.

Also Read:

NTPC Jobs 2022: నెలకు రూ.2 లక్షల జీతంతో..నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో 97 మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు..