రంపపు కొడవలితో దాడి చేసి.. కిందపడేసి గొంతు కోసి దారుణం.. అసలేం జరిగిందంటే
మనుషుల్లో మానవ సంబంధాలు రోజురోజుకు పడిపోతున్నాయి. విచక్షణ కోల్పోయి ఒకరిపై మరొకరు దాడులకూ పాల్పడుతున్నారు. క్షణికావేశంలో హత్యలూ చేస్తున్నారు. తీరా చేసిన తప్పు తెలుసుకునేసరికి జీవితాన్ని...
మనుషుల్లో మానవ సంబంధాలు రోజురోజుకు పడిపోతున్నాయి. విచక్షణ కోల్పోయి ఒకరిపై మరొకరు దాడులకూ పాల్పడుతున్నారు. క్షణికావేశంలో హత్యలూ చేస్తున్నారు. తీరా చేసిన తప్పు తెలుసుకునేసరికి జీవితాన్ని అంధకారంలో పడేస్తున్నారు. తాజాగా వివాహేతర సంబంధం కారణంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. అదే మహిళలతో సంబంధం నెరుపుతున్న వ్యక్తిని దారుణంగా కొట్టి హత్య(Murder) చేశాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటకు(Bestavaripeta) చెందిన శ్రీనివాసరెడ్డికి కూలీ పనులకు వచ్చే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య సాన్నిహిత్యంగా మారింది. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ప్రారంభమైంది. అయితే ఇదే మహిళతో ఎనిమిది నెలల నుంచి శ్రీనాథరెడ్డి అనే వ్యక్తి కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మహిళను తన వద్దకు రానీయకండా శ్రీనాథరెడ్డి అడ్డుకుంటున్నాడని శ్రీనివాసరెడ్డి కక్ష పెంచుకున్నాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న శ్రీనాథరెడ్డిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
పథకం ప్రకారం మొక్కజొన్న పొలానికి నీరు పెడుతున్న శీనాథరెడ్డి తలపై రంపపు కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీనాథరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అన్యాయంగా శ్రీనాథరెడ్డిని హత్య చేశారని రోదించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి నిందితుడిని శనివారం అరెస్టు చేశారు. తక్కువ సమయంలో కేసు ఛేదించినన వారిని ఎస్పీ అభినందించారు.
Also Read
Ind Vs Sl: శ్రీలంకపై సూపర్ విక్టరీ.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానం ఎంతంటే..