పొలం పనులు చేస్తుండగా చేతికి తాకిన వస్తువు.. ఓపెన్ చేస్తే ఫ్యూజులు ఔట్..!
కర్నూలు జిల్లాలో మరోసారి నాటు బాంబులు కలకలం రేపాయి. వీటి పేరు చెబితేనే స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పత్తికొండ(Pathikonda)లో ఓ రైతు పొలంలో నాటు బాంబులు(Bomb) దొరికాయి....
కర్నూలు జిల్లాలో మరోసారి నాటు బాంబులు కలకలం రేపాయి. వీటి పేరు చెబితేనే స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పత్తికొండ(Pathikonda)లో ఓ రైతు పొలంలో నాటు బాంబులు(Bomb) దొరికాయి. ఒకే ప్రాంతంలో గత నెల రోజుల క్రితం పొలాల్లో పని చేసుకుంటున్న మహిళకు నాటు బాంబులు లభించాయి. వాటిని ముట్టుకోవడంతో అవి పేలాయి. ఈ ఘటనలో ఆ మహిళ చేతికి తీవ్ర గాయాలై, చేయిని కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి పత్తికొండ నగరంలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 26 నాటు బాంబులను స్వాధీనం(Seize) చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి అదే అటవీ ప్రాంతంలోని పొలాల్లో ఒక నాటుబాంబు దొరకడంతో రైతులు కలవరపడుతున్నారు. పొలాలలో నాటు బాంబు ఉండడంతో చుట్టుపక్కల రైతులు, రైతు కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడి పోతున్నారు.
కొలిమి జాకీర్.. తన తల్లితో కలిసి రోజువారీ గానే పొలానికి వెళ్లగా.. నీలిరంగు కవర్ పడి ఉండటాన్ని అతని తల్లి గమనించింది. నాటుబాంబులాగా ఉందని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నాటు బాంబును గుర్తించి దానిని నీటిలో వేసి నిర్వీర్యం చేశారు. అదే ప్రాంతంలోని పొలాల్లో రెండుసార్లు నాటు బాంబులు లభ్యం కావడంతో రైతులు హడలిపోతున్నారు. వన్యప్రాణులను చంపడానికి బాంబులు పెట్టారా లేక ఎవరినైనా చంపడానికి బాంబులు పెట్టారా అనేది తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి.
Health Tips: అన్నం తింటూ మధ్యలో నీళ్లు తాగడం మంచిది కాదా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
Diabetes: మామిడి, అల్లం, ఉసిరి, పసుపుతో తయారు చేసిన మిశ్రమాన్ని రోజూ పరగడుపున తిన్నారంటే..