AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: అన్నం తింటూ మధ్యలో నీళ్లు తాగడం మంచిది కాదా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

మాములుగా నీరు ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తూ ఉంటారు. అయితే భోజనం చేసేటప్పుడు మాత్రం మధ్యలో నీళ్లను తాగకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు.

Health Tips: అన్నం తింటూ మధ్యలో నీళ్లు తాగడం మంచిది కాదా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
Drinking Liquids With Meals
Ram Naramaneni
|

Updated on: Mar 06, 2022 | 8:32 PM

Share

Drinking Liquids with Meals: మాములుగా నీరు ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తూ ఉంటారు. అయితే భోజనం చేసేటప్పుడు మాత్రం మధ్యలో నీళ్లను తాగకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. నీరు పద్దతి ప్రకారం తాగకపోతే జీర్ణక్రియకు తీవ్ర అంతరాయం కలుగుతుందని  ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు. ఎక్కువ మంది అన్నం తింటూ మధ్యమధ్యలో నీళ్లు తాగుతూ ఉంటారు. నీళ్లు తాగుతూ తినడం వల్ల భోజనం త్వరగా కంప్లీట్ అవుతుందని… కొంత టైమ్ సేవ్ చేసిన వారమవుతామని అనుకుంటారు.  కానీ ఆ పరిస్థితి మీకే నష్టం కలిగిస్తుంది.  ఇలా భోజనం చేస్తూ మధ్యలో నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. ఆహారం సరిగా జీర్ణంకాదు. అజీర్తి వంటి రోగాలు వెంటాడతాయి. దీనివల్ల సంపూర్ణంగా ఆహారాన్ని జీర్ణం చేయలేవు జీర్ణ రసాలు. అందుకే భోజనాన్ని ప్రారంభించే ముందు అధికంగా తీరు తాగడం లేదా భోజనం మధ్యలో నీళ్లు, కూల్ డ్రింకులు తాగడం వంటివి చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. తింటున్నప్పుడు మధ్యమధ్యలో నీటిని తాగుతుండడం వల్ల ఊబకాయం కూడా వచ్చే చాన్స్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అలాగే అన్నం తిన్న తర్వాత కూడా అరగంట పాటూ నీళ్లు తాగకూడదు.  ఎక్కిళ్ళు వస్తే, మరీ తప్పని పరిస్థితి అయితే లైట్‌గా కొంచెం సిప్ చేయాలి. అందుకే ఆయుర్వేదం, ప్రాచీన భారతీయ వైద్య విధానం, తగినంత నీరు తాగడం వల్ల కలిగే అన్ని ప్రయోజనాలను వారు సరైన మార్గంలో వాటర్ తీసుకుంటేనే పొందవచ్చని పదే పదే చెబుతున్నాయి. తిన్న తర్వాత 30 నిమిషాల విరామం తర్వాత నీరు తాగటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తిన్న 1 – 2 గంటల తర్వాత మీ దాహాన్ని బట్టి మీకు కావలసినంత నీరు తాగవచ్చు.

అన్నం తింటూ నీటిని తాగడం వల్ల కలిగే అనర్థాలు….

  1. ఆహారం తీసుకుంటూ వాటర్ తాగడం వల్ల జీర్ణం కాని ఆహారాల్లో కొంత భాగం కొవ్వుగా మారుతుంది.
  2. ఇలా తినడం వల్ల సగం ఆహారం జీర్ణం కాక, శక్తిగా మారకుండా వృథా అవుతుంది
  3. జీర్ణాశయంలోని ఎంజైమ్ ల పనితీరు తగ్గుతుంది.
  4. ఈ పరిస్థితి డయాబెటిస్ రావడానికి దోహదపడుతుంది
  5. శరీరంలో అనవసరపు విషపదార్థాలు చేరే ప్రమాదం ఉంది
  6. ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది
  7. ఆహారం త్వరగా జీర్ణంకాదు

గమనిక: ఈ వార్త కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రచురించబడింది. మీకు ఏమైనా అనుమానాలు ఉండే పౌష్ఠికాహార నిపుణులు, డాక్టర్ల  సలహా తీసుకోండి..

Also Read: బ్రేక్‌పాస్ట్‌లో బొద్దింక.. లంచ్‌లో కప్పపిల్ల.. ట్రిపుల్ ఐటీ హాస్టల్లో కలుషిత ఆహారం

మైండ్ బ్లాంక్ అయ్యే సీన్.. డీజిల్​లో 75 శాతం నీరు.. స్పాట్‌లో నిలిచిపోయిన వాహనాలు