AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మైండ్ బ్లాంక్ అయ్యే సీన్.. డీజిల్​లో 75 శాతం నీరు.. స్పాట్‌లో నిలిచిపోయిన వాహనాలు

రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్​పేట్ మున్సిపల్ పరిధిలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది.  ఓఆర్ఆర్ దగ్గర్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్‌.. వాహనదారులను నిలువునా ముంచుతుంది.

Telangana: మైండ్ బ్లాంక్ అయ్యే సీన్.. డీజిల్​లో 75 శాతం నీరు.. స్పాట్‌లో నిలిచిపోయిన వాహనాలు
Petrol Pump Cheating
Ram Naramaneni
|

Updated on: Mar 06, 2022 | 3:55 PM

Share

Hyderabad: రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్​పేట్ మున్సిపల్ పరిధిలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది.  ఓఆర్ఆర్(Orr) దగ్గర్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్‌.. వాహనదారులను నిలువునా ముంచుతుంది. డీజిల్‌లో భారీగా నీటిని కలిపి కష్టమర్లను మోసం చేస్తున్నారు.  నీరు కలిసిన డీజిల్ నింపడం వల్ల 4 కార్లు, ఒక బోర్ లారీ స్పాట్‌లో ఆగిపోయాయి. ఆయిల్ కొట్టగానే బండ్లు ఆగిపోవడంతో అయోమయానికి గురైన వాహనదారులు.. టెస్టింగ్ చేయగా ఘరానా మోసం వెలుగుచూసింది.  నీటితో కూడిన డీజిల్ పోసినట్లు గుర్తించారు. డీజిల్‌లో 25 శాతం మాత్రమే ఆయిల్ ఉందని.. మిగతా 75 శాతం నీరు ఉందని కస్టమర్లు చెబుతున్నారు. దీనిపై అక్కడి సిబ్బందిని ప్రశ్నించినా.. సరైన రెస్పాన్స్ లేదని వాపోతున్నారు. తమకు తెలియకుండా కలిసిందేమో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఫైర్ అవుతున్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అసలు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతుంటే.. సామాన్యలను నిలువునా దోచేస్తున్న ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బంక్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల.. కాస్ట్లీ వాహనాలకు సైతం రిపేర్లు వస్తున్నాయని చెబుతున్నారు. హైవే పక్కనే ఉండి.. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న పంప్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read: Telangana: ఆదిలాబాద్ జిల్లాలో వింత.. పాలు తాగుతున్న శివాలయంలోని నంది

కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 3వ తరగతి బుడ్డోడు.. రీజన్ తెలిస్తే అవాక్కే

Follow Us
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..