Telangana: కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 3వ తరగతి బుడ్డోడు.. రీజన్ తెలిస్తే అవాక్కే

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌కు ఓ వింతకేసు వచ్చింది. మూడో తరగతి చదువుతున్న బడ్డోడు కంప్లైంట్ ఇచ్చేందుకు రావడంతో స్టేషన్‌లో పోలీసులంతా అవాక్కయ్యారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Telangana: కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 3వ తరగతి బుడ్డోడు.. రీజన్ తెలిస్తే అవాక్కే
Boy Complaint
Follow us

|

Updated on: Mar 05, 2022 | 5:34 PM

Mahabubabad district: స్కూల్లో టీచర్ కొట్టాడని… ఏడేళ్ల బుడతడు పంతుళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ప్రతీ ఒక్కరినీ నివ్వేర పోయేలా చేసింది..ఆ బుడతడి ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పోలీసులు చకచకా పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.. తగ్గేదేలే అన్నట్లు… మహబూబాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఆ బుడ్డోడి ధైర్యాన్ని మీరే చూడండి.. కామన్ గా పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే ఎవరైనా కాస్త ఆలోచిస్తారు.. మరికొందరికైతే ధైర్యమే చాలదు. కానీ ఏడేళ్ల ఈ చిచ్చరపిడుగు… అదురు బెదురు లేకుండా… ఏకంగా పంతుళ్లపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను ఇద్దరు టీచర్లు కారణం లేకుండా కొట్టారని… వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్సైకు ఫిర్యాదు చేశాడు.. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు చకచకా విచారణ చేపట్టారు.. స్కూల్ కు వెళ్లి పంతుళ్లను ప్రశ్నించిన పోలీసులు.. బాలుడిని కాస్త శాంతింప చేశారు.

ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది..? బాలుడు ఎందుకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడనేదే కదా మీ సందేహం..? అనిల్ అనే ఈ బాలుడు మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని నిర్మలా ప్రైవేట్ స్కూల్లో రెండోతరగతి చదువుతున్నాడు.. స్కూల్ కు రెగ్యులర్ గా రావడంలేదని టీచర్లు దండించడంతో చకచకా పాఠశాల నుంచి బయటకు వెళ్ళాడు..నేరుగా అక్కడి నుండి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఎస్సై రమాదేవిని కలిసి తనను సన్ని, వెంకట్ అనే టీచర్లు కొట్టారని… ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. ఆ బాలుడి ధైర్యాన్ని మెచ్చుకున్న పోలీసులు… స్కూలుకు వెళ్లి విచారణ చేపట్టారు. తగ్గేదేలే అన్నట్టు ఈ బుడ్డోడు వ్యవహరించిన తీరు…అటు పోలీసు శాఖలో, ఇటు విద్యా శాఖలో తీవ్ర చర్చగా మారింది.

Also Read: టక్కులాడి.. కి’లేడీ’.. ఏం చేసిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది..

Goji Berries: వీటి గురించి మీకు తెలుసా… రోజుకో అర గుప్పెడు తింటే ఎంతో ఆరోగ్యం

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?