RBI Assistant Recruitment 2022: ఆర్బీఐలో 950 అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తుకున్నారా? ఇక మూడు రోజులే గడువు..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్, రెగ్యులేటరీ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) దేశ వ్యాప్తంగా అన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల (Assistant Posts) భర్తీకి..
RBI Assistant Recruitment 2022 Notification: భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్, రెగ్యులేటరీ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) దేశ వ్యాప్తంగా అన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల (Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 950
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ పోస్టులు
హైదరాబాద్‌లో: 25
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు డిసెంబర్1, 2021నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.15,000ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత సాధిస్తే చాలు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తమ స్థానిక భాషలో ప్రావీణ్యత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- ఓబీసీ/జనరల్ అభ్యర్ధులకు: రూ.450
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ.50
- ఆన్‌లైన్ పరీక్షలు: 2022, మార్చి 26, 27 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 8, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: