Good News: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో.. JIPMERలో 143 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER).. నర్సింగ్ ఆఫీసర్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజిస్ట్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (Junior Administrative Assistant Posts) ఇతర..

Good News: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో.. JIPMERలో 143 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Jipmer Recruitment
Follow us

|

Updated on: Mar 05, 2022 | 5:49 PM

JIPMER Puducherry Recruitment 2022: జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER).. నర్సింగ్ ఆఫీసర్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజిస్ట్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (Junior Administrative Assistant Posts) ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 143 గ్రూప్ B పోస్టులు: 121 గ్రూప్ c పోస్టులు: 22

పోస్టుల వివరాలు: Nursing Officer, Medical Laboratory Technologist (MLT), Junior Engineer (Civil), Junior Engineer (Electrical), Technical Assistant in NTTC, Dental Mechanic, Anaesthesia Technician, Stenographer Grade 2, Junior Administrative Assistant (JAA)

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: పోస్టును బట్టి నెలకు రూ.19,900ల నుంచి రూ.44,900ల వరకు జీతంగా చెల్లస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌/డిగ్రీ/డిప్లొమా/తత్సమాన అర్హత ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

JIMPER రిక్రూట్‌మెంట్‌ పరీక్షల తేదీలు:

  • నర్సింగ్ ఆఫీసర్ జూనియర్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), డెంటల్ మెకానిక్‌ పరీక్ష తేదీ: ఏప్రిల్ 17 (ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిముషాల వరకు జరుగుతుంది.
  • అనస్థీషియా టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజిస్ట్ పోస్టులకు పరీక్ష తేదీ: ఏప్రిల్ 17 (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల నుంచి 2 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
  • ఎన్‌టీటీసీలో టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్ష తేదీ: ఏప్రిల్ 17 సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.

హాల్ టికెట్లు విడుదల తేదీ: ఏప్రిల్ 11, 2022.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • ఓబీసీ/జనరల్‌ అభ్యర్ధులకు: రూ.1500
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ.1200
  • పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము:

  • ఓబీసీ/జనరల్‌ అభ్యర్ధులకు: రూ.450
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ.50
  • ఆన్‌లైన్‌ పరీక్షలు: 2022, మార్చి 26, 27 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: మార్చి10, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

RBI Assistant Recruitment 2022: ఆర్బీఐలో 950 అసిస్టెంట్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తుకున్నారా? ఇక మూడు రోజులే గడువు..