Telangana: టక్కులాడి.. కి’లేడీ’.. ఏం చేసిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది..

సొసైటీ కల్తీ మనుషులతో మిళితం అయితపోయింది. ఎవర్ని నమ్మాలో.. ఎవర్ని నమ్మకూడదో తెలియడం లేదు. మన అనుకున్న వాళ్లు కూడా అదును చూసి వేటు వేస్తున్నారు. బయటవారిని నమ్ముదామంటే..

Telangana: టక్కులాడి.. కి'లేడీ'.. ఏం చేసిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది..
Cheater
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 03, 2022 | 5:19 PM

సొసైటీ కల్తీ మనుషులతో మిళితం అయితపోయింది. ఎవర్ని నమ్మాలో.. ఎవర్ని నమ్మకూడదో తెలియడం లేదు. మన అనుకున్న వాళ్లు కూడా అదును చూసి వేటు వేస్తున్నారు. బయటవారిని నమ్ముదామంటే.. వెలుగుచూస్తున్న ఘటనలు వెన్నులో వణుకు పెట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి షాకింగ్  ఘటనే వెలుగుచూసింది. ఇంట్లో పనిచేయడానికి పెట్టుకున్నందుకు.. ఓనర్ ఇంటినే గుల్ల చేసింది ఓ పనిమనిషి. నమ్మకంగా ఉంటుందని పనిలో పెట్టుకుంటే నట్టేట ముంచింది. ఇలా పనికి పెట్టుకున్నవారు.. ఇళ్లకు కన్నాలేసిన ఘటనలు చాలా వెలుగుచూశాయి. కానీ ఈ  లేడీ వేసిన మాస్టర్ ప్లాన్ గురించి తెలిస్తే.. ఒక్క నిమిషం మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది.. అవును మేడ్చల్ జిల్లా(Medchal district) నాచారం(Nacharam)లో జరిగిన ఈ ఘటన తాలూకా  వివరాలు తెలుసుకుందాం పదండి. శశిధర్ అనే వ్యక్తి లండన్‌లో ఉంటాడు. ఆమె తల్లి నాచారంలో నివాసం ఉంటుంది. అయితే వయస్సు మీద పడటంతో తల్లి బాగోగులు చూస్తుందని.. గత ఏడాది భార్గవి అనే మహిళను ఇంట్లో పనికి పెట్టి వెళ్లాడు. ఆమెకు నెలకు 15 వేల జీతం ఇస్తున్నాడు. ఆదిలాబాద్ మందమర్రి చెందిన సదరు మహిళ.. భర్తతో మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఇంటి యజమానురాలు కళ్లకి సమస్య వచ్చి ఐ హాస్పటల్‌కు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన పనిమనిషి(Maid) భార్గవి కంటి మందు బాటిల్‌లో.. బాత్​రూం క్లీనర్​, జండు బామ్, నీళ్లు కలిపింది. ఆ మిశ్రమాన్ని రోజుకి ఒకసారి చొప్పున నాలుగు రోజులు వృద్ధురాలి కళ్లలో వేసింది. చివరికి ఆమె కళ్లు పోవడంతో ఇంట్లో ఉన్న 6 తులాల గోల్డ్, 40వేల డబ్బు దొంగతనం చేసింది.

తల్లి పరిస్థితి తెలిసి.. పారెన్ నుంచి వచ్చిన  కుమారుడు ఆమెను ప్రసాద్ ఐ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.  టెస్టులు చేసిన డాక్టర్ ఆమె కళ్లలో విష ప్రయోగం జరిగిందని చెప్పారు. అప్పుడు పనిమనిషిపై అనుమానం వచ్చి గడ్డిగా అడగ్గా.. ఇళ్లు వదిలి జంపయ్యింది. నాచారం పోలిసులకు సమాచారం ఇవ్వగా పనిమనిషిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం కక్కేసింది. నిందితురాలు దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కి తరలించారు. నమ్మించి.. గొంతు కోయడమంటే ఇదేనేమో..!

Also Read: AP: శివుని చెంత జాగారంలో జనం.. ఊర్లో నుంచి శబ్ధాలు.. పరుగు పరుగున వెళ్లి చూడగా..

కుక్కపిల్లను బలి ఇచ్చి.. రక్తం తాగిన చిన్నారులు.. ఆ తర్వాత