AP: శివుని చెంత జాగారంలో జనం.. ఊర్లో నుంచి శబ్ధాలు.. పరుగు పరుగున వెళ్లి చూడగా..
ప్రజలంతా గుడిలో జాగారంలో ఉన్నారు. ఊహించని విధంగా ఊర్లో నుంచి వచ్చిన శబ్ధాలు వారికి భయాన్ని కలిగించాయి. పరుగు పరుగున అక్కడికి వెళ్లి చూడగా అసలు బాగోతం వెలుగుచూసింది.
శివరాత్రి(Shivratri ) రోజు… ప్రజలంతా గుడిలో జాగారంలో ఉన్నారు. మనసంతా శివుడ్ని నింపుకుని ఆరాధిస్తున్నారు. కానీ ఊహించని విధంగా ఊర్లో నుంచి వచ్చిన శబ్ధాలు వారికి భయాన్ని కలిగించాయి. పరుగు పరుగున అక్కడికి వెళ్లి చూడగా అసలు బాగోతం వెలుగుచూసింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రకాశం జిల్లా(prakasam district) కనిగిరి మండలం ఏరువారిపల్లెలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసుల రాకతో లంకెబిందెల కోసం తెగించిన కేటుగాళ్ల ముఠా గుట్టు రట్టయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. మాంత్రికుల సలహాతో శివరాత్రి రోజున గుప్త నిధుల గ్యాంగ్ ఏరువారిపల్లిలో దిగింది. బాలిరెడ్డి అనే వ్యక్తికి చెందిన స్థలంలో లంకె బిందెలున్నాయని మాంత్రికులు చెప్పారు. అందరూ జాగారానికి ఆలయాలకు వెళ్తారని తెలియడంతో కేటుగాళ్లు ఆ రోజున ముహూర్తం పెట్టుకున్నారు. ఈజీగా తమ పని ముగించి బయటపడొచ్చని భావించారు. దర్శి(Darsi), కెల్లంపల్లి, మర్రిపూడికి చెందిన ఏడుగురు సభ్యుల ముఠా మంగళవారం సాయంత్రం ఆ గ్రామ శివార్లకు చేరుకుంది. అనుకున్న ప్లాన్ ప్రకారం బాలిరెడ్డికి చెందిన పశువుల కొట్టంలోకి వెళ్లారు. గేదెల తాళ్లు విప్పేసి అక్కడి నుంచి బయటకు తోలారు. తవ్వకాలు అంటే గప్‌చుప్‌గా గడ్డపారలతో తవ్వడం కాదు.. ఏకంగా జేసీబీనే అక్కడికి రప్పించారు. వెంటనే తవ్వకాలు షురూ చేశారు. ఊర్లో నుంచి శబ్దాలు వినిపించడంతో..గ్రామస్థులకు అనుమానం వచ్చింది
వెంటనే అక్కడికి వచ్చి పరిశీలించగా అసలు విషయం బోధపడింది. వెంటనే కనిగిరిలో ఉంటున్న ఆ స్థలం యజమాని బాలిరెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. బాలిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయండతో.. వెంటనే ఎస్సై తన సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చారు. స్పాట్‌లో నలుగురిని అదుపులోకి తీసుకోగా.. మరో ముగ్గురు ఎస్కేప్ అయ్యారు. జేసీబీని స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: శైవ పుత్రులు.. శివుని అంశగా భావిస్తారు.. ఎలుగుబంటి చర్మాన్ని కప్పుకుని