AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: శైవ పుత్రులు.. శివుని అంశగా భావిస్తారు.. ఎలుగుబంటి చర్మాన్ని కప్పుకుని

శివుణ్ని శాంతింప జేసేందుకు.. వాళ్లు శునకాల్లా మారిపోతారు. పట్టుకునేందుకు చేతులున్నా... ఒంగొని డైరెక్టుగా నోటితోనే పంచామృతాన్ని సేవిస్తారు. అదేమంటే... మేం కాలభైరవులం అంటారు.

Andhra Pradesh: శైవ పుత్రులు.. శివుని అంశగా భావిస్తారు.. ఎలుగుబంటి చర్మాన్ని కప్పుకుని
Strange Customs
Ram Naramaneni
|

Updated on: Mar 02, 2022 | 9:08 PM

Share

Anantapur district: మాఘమాసం శివరాత్రి ఉత్సవాలు.. మామూలుగా ఉండదు.. అనంతపురం జిల్లాలో కనిపించే ఈ వింత ఆచారం పాతోళ్లకు మామూలుగానే కనిపిస్తుంది. కొత్తోళ్లకు మాత్రం… వామ్మో అనిపిస్తది. అప్పటిదాకా మామూలు మనుషుల్లా ఉన్నవాళ్లు.. ఒక్కసారిగా విచిత్రమైన విన్యాసాలతో… వినూత్నమైన చర్యలతో … వికృతంగా ప్రవర్తించడం షాకింగ్‌లా అనిపిస్తుంది. తమను తాము శైవ స్వరూపాలుగా భావించి.. ఎలుగుబంటి చర్మం కప్పుకొని.. ఓ వైపు ఢమురకం మోగిస్తూ.. మరోవైపు ఉరుముల శబ్ధాల మధ్య నృత్యాలు చేస్తుంటారు. హఠాత్తుగా కాలభైరవ స్వరూపాలైన శునకాల్లా మారిపోతారు. నేలపై గిన్నెల్లో పెట్టిన పాలను పడుకుని తాగుతారు. చూసినవాళ్లకు.. వీళ్లసలు ఏం చేస్తున్నారు? అనే అనుమానం రాకుండా ఉండదు. నిజానికి.. ఇది శివుణ్ని పూజించే ఒక రకమైన ఆచారం అని తెలిశాక.. ఇక్కడి న్యూ కమర్స్‌ ముక్కున వేలేసుకోవాల్సిందే. వీరంతా శైవ పుత్రులు.. తమను తాము శివుని అంశగా భావిస్తారు.. వారి వేషధారణ చూస్తే భయానకంగా ఉంటుంది. ఎలుగుబంటి చర్మాన్ని కప్పుకుని ఉంటారు… చేతిలో ఢమురం మోగిస్తూ.. హరహరమహదేవ శంభో శంకర(Lord Shiva) అంటూ వీధుల్లో తిరుగుతుంటారు. అలాంటి వేషధారణలో సుమారు 15మంది ఒకే చోట దర్శనమిస్తారు. శివమాల ధరించిన స్వాములు వందల మంది వారిచుట్టూ మూగుతారు. ఆ చుట్టూ 2వేల మంది జనం. ఇక అప్పుడు మొదలవుతుంది ఈ ఎపిసోడ్‌. ఊరుములుగా చెప్పుకొనే వాయిద్యాలు వాయిస్తూ.. ఢమురకం మోగిస్తూ వారు చేసే ఉత్సవం.. కొంత భయానకంగా.. మరికొంత ఆశ్చర్యకరంగా ఉంటుంది.

ఎదురుగా అద్భుతమైన అలంకరణతో.. శివలింగం ఊరేగింపుగా వస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో.. పూనకం వచ్చిందంటూ ఊగిపోయేవాళ్లు ఊగిపోతుంటారు. ఒకరితో ఒకరు కొట్లాటకూ దిగుతారు. అదే సమయంలో, అక్కడ కొన్ని గిన్నెల్లో పాలు పోసి ఉంటాయి. ఇక, ఈ కాలభైరవులు.. భీకరమైన రూపంలో సిద్ధమైపోతారు. అప్పటి దాకా శైవ భక్తులుగా కనిపించినవారంతా… మల్లన్న స్వరూపాలుగా చెప్పుకొనే కాలభైరవులుగా మారిపోతారు. అంటే, అచ్చం శునకం మాదిరిగా.. గిన్నెల్లో ఉన్న పాలను నోటితో తాగుతారు. అసలు ఏంటి ఈ ఉత్సవం.. ఎందుకిలా చేస్తారు? ప్రతి మాఘ మాసం జరిగే శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లాలో కనిపించే వింతాచారం ఇది. ప్రసిద్ధి చెందిన కూడేరు మండలం జోడు లింగాల క్షేత్రం దగ్గర.. ఏటా ఈ సంప్రదాయ పండగ కొనసాగుతోంది. ఇక్కడ శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివలింగంతో ఊరేగింపు నిర్వహిస్తూ. గ్రామోత్సవం నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఇక్కడ, శైవస్వరూపాలుగా చెప్పుకునే గురవయ్యలు.. కార్యక్రమంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఈ పాలు నేరుగా నోటితో తాగడమేంటి? గిన్నెను చేతుల్లో పట్టుకుని తాగలేరా? ఎందుకిలా చేయడం.. అంటే ఇది స్వామి ఆజ్ఞ అంటారు.

కర్నూలు జిల్లా దేవరగట్టు ప్రాంతానికి చెందిన సుమారు 15మంది… జోడు లింగాల క్షేత్రానికి వస్తారు. ఈ గ్రామోత్సవంలో ఈ గురవయ్యలు ప్రదర్శనగా వస్తారు. వీరిలో 6గురు ఊరుములు వాయిస్తూ వస్తారు. శివపార్వతులు, వినాయకుడు, కుమారస్వామి వేషాల్ని దరిస్తారు. ఈ ప్రదర్శనను నడి ఊళ్లో ఆపేస్తారు. అక్కడ గ్రామస్తులు.. కొన్ని గిన్నెల్లో పాలు పోసి ఉంచుతారు. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. ఉరుములు కొడుతుంటే ఆ శబ్ధానికి తగిన విధంగా ఢమురకం మోగిస్తూ.. విన్యాసాలు చేస్తారు గురవయ్యలు. పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. దేవరగట్టులో జరిగే కర్రల యుద్ధం తరహాలో ఒకరి పై ఒకరు కోట్లాటకు దిగుతారు. ఒక్కోసారి తీవ్రగాయాలై.. ఒళ్లు రక్తసిక్తమవుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా శునకాలుగా మారిపోతారు. అంటే కాలభైరవ స్వరూపాలుగా మారిపోయి.. గిన్నెల్లో పెట్టిన పాలను ఒంగొని నోటితో తాగేస్తారు. దీనికి ఈ గురువులు చెప్పే రీజన్‌ భలే ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది.

ఏంది సామీ… ఏందీ.. మూఢాచారం ఏంటి… అన్ని అడిగేవాళ్లూ ఉన్నారు. మనుషులు కుక్కల్లా మారిపోయి… ఒంగొని డైరెక్టుగా నోటితో పాలుతాగడమెందుకు? అని ప్రశ్నించే వాళ్లూ ఉన్నారు. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే.. మాత్రం.. ఊరికి శాంతి.. రాష్ట్రానికి శాంతి.. దేశానికి శాంతి.. మొత్తం ప్రపంచానికి శాంతి… జరగాలన్నదే ఈ ఉత్సవాలు, ఈ సంప్రదాయం ముఖ్య ఉద్దేశ్యమంటున్నారు గ్రామస్థులు. తరతరాల ఆచారం.. ఏళ్లనాటి సంప్రదాయం… మూఢవిశ్వాసాలు అమలయ్యే చోట తరచుగా వినిపించే మాటలివి. కానీ, ఇక్కడ కూడా సేమ్‌ డైలాగ్సే వినిపిస్తున్నాయి. టెక్నాలజీలో అంతరిక్షాన్ని దాటి వెళ్లిపోయిన రోజుల్లో.. మనుషులు భక్తిలో ఉంటే పర్వాలేదు… మరీ మూడభక్తిలో మునిగిపోతేనే డేంజర్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌.

Also Read: Viral: ఓరీ దేవుడో ఇదేం మొక్కుబడిరా బాబు..నెత్తిమీదే మంట పెట్టి.. పొంగల్‌ వండేస్తున్నారు..!

వాహనం ఆపగా కదులుతూ కనిపించిన గోనె సంచులు.. తనిఖీ చేసిన పోలీసులు షాక్