Viral Video: వీధి కుక్కల మధ్య గ్యాంగ్ వార్.. బాహుబలి యుద్ధ సన్నివేశాన్నే మించిపోయింది..

Viral Video: వీధి కుక్కల మధ్య గ్యాంగ్ వార్.. బాహుబలి యుద్ధ సన్నివేశాన్నే మించిపోయింది..
Dogs War

Viral Video: ఇప్పటి వరకు మనం ఎన్నో గొడవలు చూశాం. నీళ్ల కోసం పంచాయతీలు, గెట్ల పంచాయతీలు, భూముల పంచాయతీలు, ప్రతీకారాలు

Shiva Prajapati

|

Mar 03, 2022 | 6:26 PM

Viral Video: ఇప్పటి వరకు మనం ఎన్నో గొడవలు చూశాం. నీళ్ల కోసం పంచాయతీలు, గెట్ల పంచాయతీలు, భూముల పంచాయతీలు, ప్రతీకారాలు, పగలు, గ్యాంగ్ వార్‌లు రకరకాల ఘర్షణలు, గొడవలకు సంబంధించి ఎన్నో వీడియోలు చూశాం. ఇక జంతువుల విషయానికి వచ్చేసరికి.. రెండు కొళ్లు కొట్టుకోవడం, రెండు పొట్టేళ్లు, రెండు ఎద్దులు పోట్లాడుకోవడం కూడా చూశాం. జంతువుల్లో దాదాపుగా ద్విముఖ పోరునే చూశాం. అయితే, ఇలాంటి గ్యాంగ్ వార్ సన్నివేశాలన్నీ మీ జీవితంలో చూసి ఉండరు.  అవును.. వాటి పోరు చూస్తే గుండెలదిరిపోతాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో వీధి కుక్కలు(Stray Dogs) రెండు గ్యాంగ్‌లుగా విడిపోయి ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డాయి. అదికూడా భారీ సంఖ్యలో జనం చూస్తుండగానే ఈ పోరాటం సాగింది. జనావాసాల్లో అయితే స్ట్రాంగ్‌గా ఉండదనుకున్నాయో ఏమో గానీ.. విశాలమైన మైదాన ప్రాంతానికి వచ్చి మరీ కయ్యానికి కాలు దువ్వుకున్నాయి.  దీనికి సంబంధించిన సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు బాబోయ్.. ఇవేంటి ఇలా ఉన్నాయంటూ హడలిపోతున్నారు.

ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందో ఒకసారి తెలుసుకుందాం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వ్యవసాయం క్షేత్రంలోని మైదాన ప్రాంతంలోకి కొందరు మనుషులు కర్రలు పట్టుకుని గుమిగూడారు. ఇంతలో ఓ వైపు నుంచి ఎర్ర రంగు కలిగిన కొన్ని కుక్కల గ్యాంగ్ ముందుకు వచ్చింది. మరోవైపు నుంచి తెలుపు, నలుపు రంగు కలిగిన మరికొన్ని కుక్కల గ్యాంగ్ దూసుకొచ్చింది. చుట్టూ ఉన్నవారు ఏం జరుగుతుందా? అని ఆసక్తిగా చూస్తు నిల్చున్నారు. ఇంతలో ఆ రెండు కుక్కల గ్యాంగ్ తమ పంచాయతీని షురూ చేశాయి. ఒక గ్యాంగ్‌ మీదకు మరో గ్యాంగ్ దూసుకెళ్తున్నాయి. పెద్ద పెద్దగా అరుచూస్తే.. వాటి భాషలో అవి పోట్లాడుకున్నాయి. ఆ గ్యాంగ్ వార్ చూసి షాక్ అయిన అక్కడి జనాలు బెంబేలెత్తిపోయారు. వాటిని నియంత్రించే ప్రయత్నం చేశారు. తమ చేతుల్లోని కర్రలతో ఆ కుక్కల గ్యాంగ్‌లను తరిమేశారు. అయినప్పటికీ వాటి పౌరుషం ఏమాత్రం తగ్గలేదు. వెనక్కి చూస్తూ గట్టిగా అరుస్తున్నాయి. చివరకు ఎలాగోలా కుక్కలను స్థానికులు అక్కడి నుంచి చెదరగొట్టారు.

అయితే, ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు హడలిపోతున్నారు. ఇదెక్కడి గ్యాంగ్స్‌రా బాబూ అంటూ భయపడిపోయారు. కుక్కల్లోనూ గ్యాంగ్స్ ఉంటాయా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తామిలాంటి సీన్‌ను ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం బాహుబలిలో యుద్ధ సన్నివేశాన్ని తలపించే ఈ సీన్‌ను మీరూ ఇక్కడి వీడియోలో చూసేయండి.

ఢీ అంటే ఢీ అంటూ తలపడిన వీధి కుక్కలు.. వీడియో చూడండి..

Also read:

Sleep: మీకు బోర్లాపడుకునే అలవాటు ఉందా.. అయితే చాలా సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా స్త్రీల్లో..

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓపై నీలినీడలు.. వాయిదా పడే అవకాశం..!

UP Elections 2022: యూపీలో ఆరో విడత పోలింగ్‌‌కు సర్వం సిద్దం.. అందరి దృష్టి యోగి పోటీ చేస్తున్న గోరఖ్‌పుర్‌పైనే!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu