- Telugu News Photo Gallery Lifestyle Tips If you want to look stylish then these 5 things to accompany you
Lifestyle: స్టైల్ లుక్.. ఈ 5 టిప్స్ పాటించారంటే ప్రతి ఒక్కరి చూపు మీ పైనే!
అమ్మాయిలకు అందంపై కొంచెం శ్రద్ధ ఎక్కువగానే ఉంటుంది. అందంతోపాటు.. స్టైల్‌లా కనిపించాలంటే మాత్రం అంత సులువుగా సాధ్యమయ్యే పనికాదు. కొన్ని స్టైలిష్ ఐడియాలు (stylish ideas) మీకోసం..
Updated on: Mar 03, 2022 | 6:57 PM

Keep these 5 things on your Wardrobe to look more beautiful Beauty Tips Lifestyle: అమ్మాయిలకు అందంపై కొంచెం శ్రద్ధ ఎక్కువగానే ఉంటుంది. అందంతోపాటు.. స్టైల్‌లా కనిపించాలంటే మాత్రం అంత సులువుగా సాధ్యమయ్యే పనికాదు. కొన్ని స్టైలిష్ ఐడియాలు (stylish ideas) మీకోసం..

వైట్ షర్టు.. ఎవరికైనా చాలా స్మార్ట్ లుక్ ఇస్తుంది. ముఖ్యంగా వర్కింగ్ గర్ల్స్ వార్డ్‌రోబ్‌లో వైట్ షర్టు ఖచ్చితంగా ఉండాలి. ఇది ఫార్మల్ లుక్‌కి చాలా బాగా నొప్పుతుంది. ప్యాంట్/బ్లూ జీన్స్‌తో కలిపి ధరిస్తే స్టైలిష్‌గా ఉంటుంది.

అమ్మాయిలు చాలా ఎక్కువ Accessories సేకరిస్తుంటారు. ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే యాక్సెసరీస్ తప్పనిసరిగా ధరిస్తారు. ఇటువంటి వాటిలో వాచ్ కూడా ఒకటి. ఎప్పుడైనా, ఎక్కడైనా వాచ్‌ను ధరించే వెసులుబాటుంటుంది. అందుకే ఆకర్షణీయమైన రిస్ట్ వాచ్ ఒకటి ఖచ్చితంగా బ్యాగ్‌లో ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు ఏ జ్యువెలరీ దీనికి సరిరాదు. ఈ రోజుల్లో మెటల్/లెదర్ బ్యాండ్‌లలో అనేక రకాల స్టైలిష్ వాచ్‌లు మార్కెట్లలో అందుబాటులో ఉంటున్నాయి.

గ్లాసెస్..కళ్లద్దాలు పెట్టుకోగానే ముఖంలో స్టైలిష్ లుక్ ఇట్టే కనిపిస్తుంది. కళ్లద్దాలు మీ కళ్లను ఎండ నుంచి కాపాడటమేకాకుండా.. ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తాయి. మీ ముఖాకృతికి నప్పే అందమైన ఏవియేటర్లు, పెద్ద/చిన్న సైజుల్లో ఉండే గ్లాసెస్ కూడా వార్డ్‌రోబ్‌లో చోటివ్వండి.

చాలామంది మహిళలకు బ్లాక్ ఫేవరేట్ కలర్‌గా ఉంటుంది. అందుకు ప్రత్యేక కారణాలు ఏమీ లేనప్పటికీ.. బ్లాక్ కలర్‌లో ఏ డ్రెస్ అయినా సాధారణంగా అందంగానే కనిపిస్తుంది. అందుకే స్టైలిష్‌గా కనిపించాలంటే వార్డ్‌రోబ్‌లో కొన్ని బ్లాక్ కలర్ డ్రస్సులు కూడా ఉంచుకోవాలి. ఏ సందర్భానికైనా చక్కగా నొప్పుతాయి.

జీన్స్ లేదా మరేదైనా డ్రెస్ ధరించినా స్నీకర్ షూస్ ధరిస్తే స్టైల్‌గా కనిపిస్తారు. ఐతే స్పోర్టీ అండ్ క్లాసీ లుక్ కావాలంటే తెల్లటి స్నీకర్స్ తప్పనిసరిగా ధరించాలి. డెనిమ్‌ల నుంచి షార్ట్‌ల వరకు ఏ డ్రెస్ వేసుకున్నీ వీటిని ధరించొచ్చు. స్టైలిష్ లుక్ ఇవ్వడంలో వీటి తర్వాతే ఏదైనా!!





























