LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓపై నీలినీడలు.. వాయిదా పడే అవకాశం..!
LIC IPO: రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్ ఎల్‌ఐసీ ఐపీఓపై కూడా పడింది. మార్కెట్‌లో కొనసాగుతున్న అస్థిరతతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం
LIC IPO: రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్ ఎల్‌ఐసీ ఐపీఓపై కూడా పడింది. మార్కెట్‌లో కొనసాగుతున్న అస్థిరతతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం LIC IPOని వాయిదా వేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం.. మార్చి నెలాఖరులోగా ఐపీఓ ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేస్తుంది. కానీ రష్యా-ఉక్రెయిన్ వివాదం కారణంగా ప్రపంచ మార్కెట్‌లో క్షీణత సంకేతాలు మొదలయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీవో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ వారంలో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది. ఇందులో ఎల్‌ఐసి లిస్టింగ్ ఈ సంవత్సరం మార్చిలో జరుగుతుందా లేదా అనేది నిర్ణయిస్తారు. ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, ఐపిఓ ప్రారంభ సమయాన్ని మార్చవచ్చని దీనికి సంబంధించిన ఒక అధికారి తెలిపారు.
అంతకుముందు దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడింది. ‘ఎల్‌ఐసీ ఐపీవో భారతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా IPO ప్రారంభ సమయాన్ని పునఃపరిశీలించవచ్చు’ అని తెలిపింది. IPO కోసం కంపెనీ ఫిబ్రవరి 13న మార్కెట్ రెగ్యులేటర్ SEBI వద్ద DRHPని డిపాజిట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని పెద్ద బ్యాంకులు ఎల్‌ఐసి ఐపిఓలో డబ్బును పెట్టి లిస్టింగ్‌ను వాయిదా వేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రస్తుతం మార్కెట్‌లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయని ఐపీవో అధికారి ఒకరు చెప్పారు. దీని ప్రభావం ఎల్‌ఐసి ఐపిఓపై కూడా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ వివాదం ప్రపంచ మార్కెట్‌ను కుదిపేస్తోంది. మరోవైపు విదేశీ పెట్టుబడిదారులు కూడా మార్కెట్ అస్థిరతకు భయపడుతున్నారు. తమ పోర్ట్‌ఫోలియోను నిరంతరం సమీక్షిస్తున్నారు. ఈ పరిస్థితిలో విదేశీ పెట్టుబడిదారులు IPO నుంచి దూరంగా ఉండవచ్చు. ఇది షేర్ల పనితీరును ప్రభావితం చేసే అవకాశం ఉంది.