AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan: హోమ్‌లోన్ తీసుకున్నారా.. ఈ పనిచేస్తే ప్రతినెలా రూ.5000 తగ్గుతోంది..!

Home Loan: హోమ్‌ లోన్‌ తీసుకున్నారా.. EMI వల్ల ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. గతంలో చాలా బ్యాంకులు 8 నుంచి 9 శాతానికి

Home Loan: హోమ్‌లోన్ తీసుకున్నారా.. ఈ పనిచేస్తే ప్రతినెలా రూ.5000 తగ్గుతోంది..!
Home
uppula Raju
|

Updated on: Mar 02, 2022 | 7:07 PM

Share

Home Loan: హోమ్‌ లోన్‌ తీసుకున్నారా.. EMI వల్ల ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. గతంలో చాలా బ్యాంకులు 8 నుంచి 9 శాతానికి గృహ రుణం ఇస్తుండగా ఇప్పుడు చాలా బ్యాంకులు 7 శాతానికి గృహ రుణం అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు గృహ రుణాలపై విపరీతమైన ఆఫర్లు, తగ్గింపులను ప్రకటిస్తున్నాయి. అయితే మీరు కూడా గృహ రుణం తీసుకుని EMIతో ఇబ్బంది పడితే ఈ ట్రిక్‌ తెలుసుకోండి. ప్రతి నెలా EMIలో రూ.5000 వరకు తగ్గించుకోవచ్చు. మీ పాత గృహ రుణాన్ని మరొక బ్యాంకుకు మార్చినట్లయితే EMI భారాన్ని తగ్గించుకోవచ్చు. అయితే దీని కోసం ముందుగా ప్లాన్ చేసుకొని ఉండాలి.  బ్యాంక్‌ లోన్ ట్రాన్స్‌ఫర్ మీ EMIలో ఎంత వ్యత్యాసాన్ని కలిగిస్తుందో ఒక ఉదాహరణతో చెప్పవచ్చు. మీరు 4 సంవత్సరాల క్రితం అంటే 2017లో గృహ రుణం తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు ఆ బ్యాంకు గృహ రుణంపై వడ్డీ రేటు 9.25 శాతం. ఇప్పుడు మీరు హోమ్ లోన్‌ని కొత్త బ్యాంక్‌కి షిఫ్ట్ చేసి 7 శాతానికి తీసుకుంటే మీ EMIలో ఎంత తేడా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి.

సంవత్సరం 2017

లోన్ మొత్తం 30 లక్షలు

వడ్డీ రేటు 9.25%

లోన్ కాలవ్యవధి 20 సంవత్సరాలు

EMI 27,476

2021లో మీరు ఈ హోమ్ లోన్‌ను కొత్త బ్యాంక్‌కి మార్చారని అనుకుందాం. కాబట్టి మీ బకాయి రుణం రూ.26 లక్షలు ఆదా అవుతుంది.

సంవత్సరం 2020

లోన్ మొత్తం 26 లక్షలు

వడ్డీ రేటు 6.90%

లోన్ కాలవ్యవధి 16 సంవత్సరాలు

EMI 22,400

అంటే మీరు మీ హోమ్ లోన్‌ని ఈ విధంగా మార్చుకుంటే ప్రతి నెలా మీ EMI దాదాపు రూ. 5000 తగ్గుతుంది. వడ్డీని చెల్లించడంలో మీకు చాలా ప్రయోజనం ఉంటుంది.

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓపై నీలినీడలు.. వాయిదా పడే అవకాశం..!

New Wage Code: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త వేతన కోడ్‌ అమలు..!

Health Photos: కోల్పోయిన మీ చర్మ సౌందర్యాన్ని పొందడానికి డైట్‌లో ఇవి ఉండాల్సిందే..