Shocking: కుక్కపిల్లను బలి ఇచ్చి.. రక్తం తాగిన చిన్నారులు.. ఆ తర్వాత
గగన రంగంలో అద్భుతాలు చేస్తున్నాం. త్వరలో 5జీ స్పీడ్ అందుకోబోతున్నాం. అయితే కొందరి నుంచి మాత్రం అంధవిశ్వాసాలను దూరం చేయలేకపోతున్నాం.
Viral News: టెక్నికల్‌గా రోజురోజుకు ఎంతో డెవలప్ అవుతున్నాం. అంతెందుకు ప్రపంచాన్ని వణికించి.. ఉక్కిరి బిక్కిరి చేసిన కరోనా(Coronavirus) మహమ్మారికి మెడిసిన్ కనుగొన్నాం. గగన రంగంలో అద్భుతాలు చేస్తున్నాం. త్వరలో 5జీ స్పీడ్ అందుకోబోతున్నాం. అయితే కొందరి నుంచి మాత్రం అంధవిశ్వాసాలను దూరం చేయలేకపోతున్నాం. నిత్యం గుప్త నిధులు(Treasure hunt ), రైస్ పుల్లింగ్, చేతబడులకు సంబంధించిన మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇవి కాక జంతు బలులు అయితే అన్ని చోట్లా సర్వసాధారణం అయిపోయాయి. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో జంతు బలుల కల్చర్ ఉన్నప్పటికీ, ఒరిస్సా(Odisha)లో ఇంకొంచెం ఎక్కువ. అక్కడ పిల్లలపై కూడా వీటి ప్రభావం పడింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. పెట్ డాగ్స్‌తో ఆడుకోవాల్సిన వయస్సున్న ఐదుగురు పిల్లలు.. ఓ కుక్క పిల్లను బలివ్వడం సంచలనం రేపింది.
బొలన్గిర్ జిల్లా పండారపిటా గ్రామంలో.. స్థానికంగా నిర్వహించే సులియా జాతరకు జంతుబలులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఆ గ్రామానికి చెందిన ఐదుగురు పిల్లలపై ఈ కల్చర్ దుష్ప్రభావం చూపింది. ఈ అంధవిశ్వాసానికి అట్రాక్ట్ అయిన ఆ చిన్నారులు.. ఓ కుక్కపిల్లను ఊరేగించి, పూజలు నిర్వహించి దానిని అత్యంత దారుణంగా చంపేశారు. ఆ తర్వాత పాశవికంగా దాని రక్తాన్ని తాగారు. ఇది గమనించిన పలువురు గ్రామస్థులు పిల్లలను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిన డాక్టర్లు.. ప్రజంట్ పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
Also Read: AP: శివుని చెంత జాగారంలో జనం.. ఊర్లో నుంచి శబ్ధాలు.. పరుగు పరుగున వెళ్లి చూడగా..