Telangana: బ్రేక్‌పాస్ట్‌లో బొద్దింక.. లంచ్‌లో కప్పపిల్ల.. ట్రిపుల్ ఐటీ హాస్టల్లో కలుషిత ఆహారం
నిన్న కప్పపిల్ల...! ఇవాళ బొద్దింకలు, పురుగులు..! రేపు ఏమోస్తుందో..! అవును..బ్రేక్‌పాస్ట్‌లో సర్వజీవరాశుల దర్శనం. ఇది ఎక్కడో కాదు. బాసర ట్రిపుల్ ఐటీ హాస్టల్లో....
Basara: నిన్న కప్పపిల్ల…! ఇవాళ బొద్దింకలు, పురుగులు..! రేపు ఏమోస్తుందో..! అవును..బ్రేక్‌పాస్ట్‌లో సర్వజీవరాశుల దర్శనం. ఇది ఎక్కడో కాదు..విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాసర ట్రిపుల్ ఐటీ హాస్టల్లో జరిగిన ఘటన. గత కొన్ని రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ హాస్టల్ మెస్సులో పురుగులు, బొద్దింకలు, బల్లులు, కప్పపిల్లలు కనిపిస్తున్నాయి. దీనిపై అనేకసార్లు విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేసినా తీరు మారలేదు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ హాస్టల్లో వరుసగా కలుషిత ఆహారం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. నిన్న ఉదయం బ్రేక్ పాస్ట్‌లో..చనిపోయిన కప్పపిల్ల కనిపించడంతో కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. మళ్లీ ఇవాళ ఉదయం అల్పహారంలో బొద్దింకలు, పురుగులు కనిపించాయి. దాంతో ఈ తిండి మేం తినలేమంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ట్రిపుల్ ఐటీ హాస్టల్ మెస్సులో కలుషిత ఆహారంపై మీడియాలో వరుస కథనాలు రావడంతో ఉన్నతాధికారులు అలెర్ట్ అయ్యారు. మెస్ నిర్వాహకులైన శక్తి క్యాటరింగ్ సంస్థకు నోటీసులు ఇచ్చారు. అయినా మెస్ నిర్వాహకుల తీరు మారలేదు. ఘటనపై ఉన్నతాధికారుల వివరణ కోసం వెళ్లిన మీడియాను లోపలికి అనుమతి లేదంటూ సిబ్బంది వెనక్కి పంపించేశారు.
Also Read: Telangana: మైండ్ బ్లాంక్ అయ్యే సీన్.. డీజిల్‌లో 75 శాతం నీరు.. స్పాట్‌లో నిలిచిపోయిన వాహనాలు
కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన 3వ తరగతి బుడ్డోడు.. రీజన్ తెలిస్తే అవాక్కే